Nobel Prize In Chemistry : రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్

2021 ఏడాదికిగాను రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది.

Nobel Prize In Chemistry : రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్

Che

Nobel Prize In Chemistry   2021 ఏడాదికిగాను రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జర్మనీకి చెందిన బెంజమిన్​ లిస్ట్​,యూకేకి చెందిన డేవిడ్​ డబ్ల్యూసీ మెక్​మిలన్​ లను కెమిస్ట్రీలో విభాగంలో ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ బుధవారం ప్రకటించింది.

అణు నిర్మాణానికి ఉపయోగపడే అసిమెట్రిక్​ ఆర్గానోకెటాలసిస్​ అభివృద్ధికి దోహదం చేసినందుకు వీరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇన్నేళ్లుగా  లోహాలు, ఎంజైమ్​లు అనే రెండు రకాల ఉత్ప్రేరకాలు మాత్రమే ఉన్నాయని సైంటిస్టులు విశ్వసించారు. కానీ ఈ నోబెల్​ పురస్కార గ్రహీతలు మూడో రకం కూడా ఉంటుందని..అసిమెట్రిక్​ ఆర్గానోకెటాలిసిస్​ను అభివృద్ధి చేసి రుజువు చేశారు. ఈ పరిశోధన పరమాణు నిర్మాణంలో కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఇది అసమాన అణువులను ఉత్పత్తి చేయడాన్ని మరింత సులభతరం చేస్తుంది.

కాగా, నోబెల్‌ అవార్డ్‌ కింద బంగారు పతకం, 11 లక్షల డాలర్లు నగదు పురస్కారం అందజేస్తారు. ఆ మొత్తాన్ని ఈ ఇద్దరికి పంచుతారు. అయితే,మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి, అర్థశాస్త్రాలు వంటి ఆరు విభాగాల్లో అందించే నోబెల్‌ పురస్కారాల్లో ఇది మూడవది.

సొమవారం మెడిసిన్ లో నోబెల్​ బహుమతిని ప్రకటించగా.. అమెరికా సైంటిస్టులు డేవిడ్‌ జూలియస్‌, ఆర్డెమ్‌ పటపౌటియన్‌లు ఈ బహుమతి దక్కింది. ఇక,2021 ఏడాదికిగాను ఫిజిక్స్(భౌతిక శాస్త్రం)విభాగంలో…జపాన్,జర్మనీ,ఇటలీకి చెందిన సైంటిస్టులు సుకురో మనాబో(90), క్లాస్‌ హాసిల్‌మన్‌(89), జార్జియో పారిసీ(73)ని ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ALSO READ  సొంత కాన్వాయ్ లోనే లఖిమ్‌పూర్‌ కి బయల్దేరిన రాహుల్ గాంధీ