US Aviation: బెజోస్ అంతరిక్ష పర్యటన.. యూఎస్ ఏవియేషన్ ఆంక్షలు కఠినతరం!

అమెజాన్ సీఈఓ, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ మంగళవారం భూమి నుండి 105 కిలోమీటర్ల ఎత్తులో జీరో గురుత్వాకర్షణను ఆస్వాదించి క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అది కూడా తన సొంత రాకెట్‌తో ఆకాశానికి ఎగిరిన బెజోస్ ప్రపంచంలో అంతరిక్షంలో ఇంత ఎత్తుకు వెళ్లిన తొలి బిలియనీర్ గా రికార్డు సాధించాడు.

US Aviation: బెజోస్ అంతరిక్ష పర్యటన.. యూఎస్ ఏవియేషన్ ఆంక్షలు కఠినతరం!

Us Aviation

US Aviation: అమెజాన్ సీఈఓ, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ మంగళవారం భూమి నుండి 105 కిలోమీటర్ల ఎత్తులో జీరో గురుత్వాకర్షణను ఆస్వాదించి క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అది కూడా తన సొంత రాకెట్‌తో ఆకాశానికి ఎగిరిన బెజోస్ ప్రపంచంలో అంతరిక్షంలో ఇంత ఎత్తుకు వెళ్లిన తొలి బిలియనీర్ గా రికార్డు సాధించాడు. ఆయన సొంత సంస్థ బ్లూ ఆరిజిన్ స్పేస్ అభివృద్ధి చేసిన న్యూషెపర్డ్ లో ఈ రోదసియాత్ర చేశారు.

భూమ్మీద ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మామూలే. కానీ భూ ఉపరితలాన్ని దాటి.. మనకు పూర్తిగా పరిచయం లేని మరో లోకంలో విహరించాలంటే ఆసక్తి, అభిరుచితో పాటు ఎంతో ధైర్యం కావాలి. అంతరిక్ష యాత్ర ద్వారా బెజోస్‌ సాహసం చేశారనే చెప్పవచ్చు. అయితే.. బెజోస్ అంతరిక్ష పర్యటన చేసిన అదే రోజున యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అంతరిక పర్యటన నిబంధనలు సవరించి అమల్లోకి తెచ్చింది.

ఏవియేషన్ అథారిటీ కొత్త నియమాల ప్రకారం.. ఇకపై అధికారిక వ్యోమగాములుగా ఎవరు అర్హత సాధిస్తాయనే దానిపై ఆంక్షలు కఠినతరం అయ్యాయి. దీని ప్రకారం ఇకపై 50-మైళ్ల (80 కిలోమీటర్ల) ఎత్తుకు పైకి ఎదగడానికి లైసెన్స్ పొందిన స్పేస్ క్రాఫ్ట్ సిబ్బందికి మాత్రమే అర్హత కలిగిఉంటారు. యూఎస్ ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్ సవరించిన నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగ సిబ్బంది కూడా విమాన ప్రయాణ సమయంలో ప్రజల భద్రతకు అవసరమైన, మానవ అంతరిక్ష విమాన భద్రతకు దోహదపడే కార్యకలాపాలను అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉంటుంది.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రైవేట్ యాత్రల భద్రతను పర్యవేక్షించడంతో పాటు, వాణిజ్య అంతరిక్ష రవాణాను ప్రోత్సహించడానికి ఈ కొత్త నియమాలను రూపొందించింది. సవరించిన నియమాల ప్రకారం గత వారం బెజోస్ బ్లూ ఆరిజిన్, రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్సీ వంటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థలతో అంతరిక్ష పర్యాటక రంగంలో పురోగతి సాధిస్తుందని యూఎస్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.