బ్లడ్ టైపును బట్టి కొవిడ్ రియాక్షన్ – వారిలో తక్కువ.. వీరిలో ఎక్కువ

బ్లడ్ టైపును బట్టి కొవిడ్ రియాక్షన్ – వారిలో తక్కువ.. వీరిలో ఎక్కువ

covid-19

SARS-CoV-2 నిర్ధారణ కోసం నేచరల్ బ్లడ్ టైపును రిఫెరెన్స్ గా తీసుకోవచ్చని రీసెంట్ గా 2021 మార్చి 3న సైంటిఫిక్ జర్నల్‌లో పబ్లిష్ అయింది. ఇంకా ఈ స్టడీలో A బ్లడ్ టైపు ఉన్న వారికి కొవిడ్ 19 ఇతరుల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. బ్లడ్ టైపులు A, B, Oలలో ఇన్ఫెక్షన్ ఎలా సోకుతుందని నిశితంగా పరిశీలించారు సైంటిస్టులు.

పరిశీలన తర్వాత కొవిడ్-19 అనేది బ్లడ్ గ్రూపు ఏ లోని రెస్పిరేటరీ కణాలతో త్వరగా సెట్ అవుతుంది. ఆశ్చర్యంగా అదే గ్రూపుకు చెందిన ఎర్ర రక్తకణాలపై అంతగా ప్రభావం చూపించడం లేదు.

వైరల్ RBD అనేది కేవలం బ్లడ్ గ్రూప్ ఏ.. యాంటీజెన్ల రెస్పిరేటరీ సెల్స్‌ను ప్రిఫర్ చేస్తుంది. ఇదే తరహాలో చాలా పేషెంట్లలోకి ఎంటర్ అయి ఇన్ఫెక్ట్ చేస్తుందని రాసుకొచ్చారు. పలు రకాల బ్లడ్ టైపులపై చేసిన స్టడీ తర్వాత తెలిసిందేంటంటే.. బ్లడ్ టైపు ఏ వాళ్లకు SARS-CoV-2 త్వరగా వ్యాప్తి అవుతుంది.

అక్టోబరు 2020లో విడుదల చేసిన స్టడీ ప్రకారం.. గత స్టడీలో బ్లడ్ టైపు ఏ ఉన్న వాళ్లు కొవిడ్-19 ఎఫెక్ట్ కు అతి తక్కువగా గురవుతారని తెలిసింది. పైగా వారు వైరస్ నుంచి మోస్ట్ ప్రొటెక్టడ్ పర్సన్స్ అంట. బ్లడ్ గ్రూపును బట్టి వైరస్ సోకే అవకాశాలు పెరుగుతుంటాయి. దానిని మనం ఏం చేయలేమని బ్లడ్ టైపు ఏ ను ఉద్దేశించి అంటున్నారు స్టడీ నిర్వహకులు.