వాతావరణాన్ని పాడుచేస్తున్న బ్లూ జీన్స్ క్లాత్.. నీటిని ఎంత కాలుష్యం చేస్తుందో తెలుసా..

వాతావరణాన్ని పాడుచేస్తున్న బ్లూ జీన్స్ క్లాత్.. నీటిని ఎంత కాలుష్యం చేస్తుందో తెలుసా..

వర్కింగ్ ఎట్ హోమ్ అనే చాయీస్ తీసుకున్న వాళ్లకు బ్లూ జీన్స్ కంఫర్టబుల్ కావొచ్చు కానీ, అది వాతావరణాన్ని ఎంత పాడు చేస్తుందో తెలుసా.. కెనడా దేశవ్యాప్తంగా టొరంటో నుంచి ఆర్కిటిక్ వరకూ తీసుకున్న వాటర్ శాంపుల్స్‌లో ఇండిగో డెనిమ్ మైక్రో ఫైబర్స్ ఉన్నట్లు గుర్తించారు. టోరంటో యూనివర్సిటీకి చెందిన మిరియం డైమండ్స్ అతని కొలీగ్స్ కలిసి ఈ సర్వే నిర్వహించారు.



అందులో కనుగొన్న మైక్రో ఫైబర్స్ లో 1/4వ వంతు లేదా.. 1/8వ వంతు బ్లూ డెనిమ్ వేనని తెలుసుకోగలిగారు. కొన్ని 1500మీటర్లలో లోతులోనూ కనిపిస్తున్నాయంటే ఇవి చాలా దూరం వరకూ ప్రయాణించగలవని తెలిసింది. సబ్ అర్బన్ లేక్స్ లో జీన్ మైక్రోఫైబర్స్ ఎక్కువ మొత్తంలో దొరుకుతున్నాయట. కెనడా వరకూ మాత్రమే సర్వే చేసినా.. అవసరమైతే ఇతర దేశాల్లోనూ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఆర్కిటిక్ అనేది ఫైబర్స్ వ్యాప్తి చేయడంలో ఓ సింబల్ లా ఉందని మిరియం డైమండ్ అంటున్నారు. దీంతో పాటుగా యావరేజ్ గా ఒక వాష్ లో ఎన్ని మైక్రో ఫైబర్స్ లాస్ అవుతాయనేది తెలుసుకున్నారు. వారికి తెలిసిందేంటంటే.. ఒక్క వాష్‌లో 50వేల మైక్రో ఫైబర్స్ వరకూ జీన్స్ పైన లేయర్ నుంచి కోల్పోతాయట.



ఈ ఫలితాలు ఎన్విరాన్మెంట్ సైంటిస్టులకు కొత్తగా అనిపించలేదు. దురదృష్టవశాత్తు వారు ఆల్రెడీ ఇది ముందుగానే ఊహించారట. కానీ, ఈ మైక్రో ఫైబర్స్ వాతావరణంపై ఎంత ప్రభావం చూపుతాయో.. రీసెర్చర్లు అంచనా వేయలేకపోయారు. ‘అవి ప్లాస్టిక్ కాదు. కేవలం మనం తయారుచేసినవే’ అని సమంతా ఏథె చెప్పారు.
https://10tv.in/novavax-coronavirus-vaccine-is-safe-published-results-show/
జీన్స్ ప్రొడక్షన్లో కెమికల్స్ తీసుకుంటారు. కెమికల్ మాడిఫికేషన్ అనేది ఎప్పటికీ ఓ ప్రశ్నగానే ఉంటుంది. అది క్లియర్ చేయడానికి మనం మరింత ఫోకస్ చేయాలి. అందుకే జీన్స్ ను చాలా తక్కువ సార్లు వాష్ చేయాలి అని సలహా ఇస్తున్నారు. అంటే నెలకు ఒక్కసారి మాత్రమే జీన్స్ ను ఉతకాలట.