Brazillian Patients : బ్రెజిల్‌లో విలక్షణమైన కేసులు.. ఆ ముగ్గురికి 70 రోజుల‌కుపైగా క‌రోనా పాజిటివ్‌ వస్తూనే ఉందట!

ప్రస్తుతం బ్రెజిల్ దేశంలో కరోనా కేసులు విలక్షణంగా నమోదవుతున్నాయి. సాధారణంగా కరోనా వైరస్ ఇంక్యుబేటర్ పీరియడ్ 14 రోజులు ఉంటుంది. కానీ..

Brazillian Patients : బ్రెజిల్‌లో విలక్షణమైన కేసులు.. ఆ ముగ్గురికి 70 రోజుల‌కుపైగా క‌రోనా పాజిటివ్‌ వస్తూనే ఉందట!

Three Brazilians Tested Cov

Brazillian Patients : ప్రపంచ మానవాళిని కరోనావైరస్ వదిలేలా లేదు. పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్లతో అనేక రూపాల్లో మ్యుటేషన్ అవుతోంది. కరోనా ప్రారంభంలోని పరిస్థితులకు భిన్నంగా కరోనావైరస్ విలక్షణమైన కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఎప్పుడూ ఎలా మ్యుటేషన్ అవుతుందో సైంటిస్టులు కూడా అంతుపట్టడం లేదు.

ప్రస్తుతం బ్రెజిల్ దేశంలో కరోనా కేసులు విలక్షణంగా నమోదవుతున్నాయి. సాధారణంగా కరోనా వైరస్ ఇంక్యుబేటర్ పీరియడ్ 14 రోజులు ఉంటుంది.. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా కరోనావైరస్ ఎక్కువ రోజుల పాటు యాక్టివ్ గా ఉంటుందని సైంటిస్టులు గుర్తించారు. బ్రెజిల్ కు చెందిన ఓ ముగ్గురిలో ఈ తరహా విలక్షణమైన కేసులు నమోదైనట్టు కనుగొన్నారు. ఆ ముగ్గురికి నిత్యం కరోనా పరీక్షలు చేస్తూనే ఉన్నారు.

వారికి నిరంతరాయంగా 70 రోజులు పాటు వైరస్ పాజిటివ్ రిపోర్టు వస్తూనే ఉందని అధ్యయన నివేదికలో తేలింది. క‌రోనా సోకిన కొంద‌రు వ్య‌క్తుల్లో వైర‌స్ ఎక్కువ రోజుల‌పాటు యాక్టివ్‌గా ఉంటుందని సైంటిస్టులు తేల్చేశారు. ఇలాంటి కరోనా కేసులు సాధారణ కేసులుగా పరిగణించలేమని అంటున్నారు. ఈ కరోనా కేసులు విలక్షణమైనవిగా సైంటిస్టులు చెబుతున్నారు.

38 బ్రెజిల్ కరోనా బాధితులపై అధ్యయనం :
సాధారణ క‌రోనా వైర‌స్ 14 రోజుల‌పాటు మాత్ర‌మే యాక్టివ్‌గా ఉంటుంద‌ంటారు. ఫ్రాంటియర్స్ ఇన్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన ఈ కొత్త స్టడీ రిపోర్టును పరిశీలిస్తే.. కరోనావైరస్ ఎంతకాలం యాక్టివ్ గా ఉంటుందోనన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ అధ్యయనంలో భాగంగా 38 మంది బ్రెజిలియన్ క‌రోనా బాధితులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వారికి కరోనా నెగటివ్ వచ్చేంతవరకు ఆగకుండా టెస్టులు చేస్తూనే వచ్చారు.

ఆ బాధితుల్లలో ఇద్దరు పురుషులు ఉండగా.. ఒక మహిళ ఉన్నారు. వీరికి 70 రోజులకు పైగా క‌రోనా పాజిటివ్‌గా రిపోర్ట్ వ‌చ్చింది. ఈ మూడు విలక్షణమైన కేసులుగా పరిశోధకులు చెబుతున్నారు. ఆ మహిళలో 71 రోజులు కరోనా పాజిటివ్ వస్తే.. ఇద్దరు పురుషులలో ఒకరిలో 81 రోజులపాటు వైరస్ యాక్టివ్‌గా ఉందని గుర్తించారు. ఈ ముగ్గురికి క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగానే ఉన్నాయట.. ఎవ‌రికీ ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు (కొమొర్బిడిటీలు) కూడా లేవని అధ్య‌య‌నంలో పరిశోధకులు వెల్లడించారు.

14రోజుల వ్యవధి కాదు.. నెలవరకు ఉండొచ్చు.. :
ఈ అధ్యయనం ఆధారంగా, SARS-CoV-2 సోకిన వారిలో 8 శాతం మంది వ్యక్తులు రెండు నెలలకు పైగా వైరస్‌ను వ్యాప్తి చేయగలరని అధ్యయన పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్‌ఫెక్షన్ చివరి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని మారియల్టన్ డాస్ పాసోస్ కున్హా అన్నారు. క్వారంటైన్ పీరియడ్‌గా 14 రోజుల వ్యవధి సరిపోతుందో లేదో అంచనా వేయడం అధ్యయనం ప్రధాన లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఈ విలక్షణమైన కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. బాధిత వ్యక్తి ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తి చేయలేరని నిర్ధారించుకోవడానికి 14 రోజులు సరిపోదని చెప్పారు.ఒక పేషెంట్ నెగెటివ్ పరీక్షించడానికి ఒక నెల సమయం పట్టవచ్చునని చెప్పారు.

అధ్యయనంలో ఎంపిక చేసిన బాధితుల్లో 71 రోజుల నుంచి 232 రోజుల వరకు కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్న రోగులకు నెగటివ్ రిపోర్టు వచ్చేంతవరకు పరీక్షలు చేసినట్టు వెల్లడించారు. పైగా కరోనా బాధితులు ముగ్గురిలో ఒక పురుషుడికి 232 రోజుల పాటు కరోనావైరస్ పాజిటివ్ వచ్చిందని గుర్తించారు. ఎందుకంటే అతడికి హెచ్‌ఐవి ఉందని, అప్పటికే అతడు HIV చికిత్స పొందుతున్నందున కరోనా వైరల్ లోడ్ లేదన్నారు. వారందరూ 2020 ప్రారంభంలో బ్రెజిల్‌లోకి ప్రవేశించిన B.1.1.28 వేరియంట్ బారినపడ్డారని నివేదికలు వెల్లడించాయి.

Read Also : Covid HIV Patient : కరోనా సోకిన ఆ HIV పేషెంట్ శరీరంలో ఏకంగా 21 మ్యుటేషన్లు.. అధ్యయనంలో తేల్చిన సైంటిస్టులు..!