Leonardo DiCaprio : నోరు మూసుకో.. హాలీవుడ్‌ నటుడికి బ్రెజిల్ అధ్యక్షుడి వార్నింగ్!

Leonardo DiCaprio : ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అంశాలపై తరచూ స్పందించే హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio)కు బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో (Jair Bolsonaro) నుంచి గట్టి కౌంటర్ ఎదురైంది.

Leonardo DiCaprio : నోరు మూసుకో.. హాలీవుడ్‌ నటుడికి బ్రెజిల్ అధ్యక్షుడి వార్నింగ్!

Brazilian President Tells Leonardo Dicaprio To Keep His Mouth Shut About Amazon Rainforest Protection

Leonardo DiCaprio : ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అంశాలపై తరచూ స్పందించే హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio)కు బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో (Jair Bolsonaro) నుంచి గట్టి కౌంటర్ ఎదురైంది. అమెజాన్ అడవుల్లో (Amazon Rainforest Protection) పర్యావరణ ప్రాముఖ్యతపై డికాప్రియో చేసిన వ్యాఖ్యలపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఘాటుగా స్పందించారు. అమెజాన్ పర్యావరణ ప్రాముఖ్యత గురించి మాట్లాడిన డికాప్రియోను నోరు మూసుకోమంటూ జైర్ బోల్సోనారో వార్నింగ్ ఇచ్చారు.

అమెజాన్ అడవులపై అనవసర మాటలు మాట్లాడొద్దని డికాప్రియోకు సూచించారు. అమెజాన్ అడవులకు సంబంధించి డికాప్రియో ట్వీట్ చేయడం దుమారం రేపింది. అమెజాన్ అడవులు క్షీణించిపోతున్న తరుణంలో పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. మన గ్రహాన్ని సురక్షితంగా ఉంచుకోవడంలో భాగంగా జరిగే మార్పునకు యువత ఓటింగ్ ఎంతో కీలకమన్నారు.

Brazilian President Tells Leonardo Dicaprio To Keep His Mouth Shut About Amazon Rainforest Protection (1)

Brazilian President Tells Leonardo Dicaprio To Keep His Mouth Shut About Amazon Rainforest Protection (1)

అమెజాన్, వాతావరణ మార్పులకు కీలకమైన ఇతర పర్యావరణ వ్యవస్థలకు బ్రెజిల్ నిలయమని డికాప్రియో ట్వీట్ చేశాడు. వచ్చే ఎన్నికల్లో యువత భారీ సంఖ్యలో నమోదు చేసుకుని పోలింగ్‌లో పాల్గొనాలని బ్రెజిల్ యువతకు పిలుపునిచ్చారు. లియోనార్డో ట్వీట్‌కు స్పందించిన బోల్సోనారో.. ఓటు హక్కు వినియోగం సూచించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

అమెజాన్‌ అడువులపై డికాప్రియో చేసిన వ్యాఖ్యలపై అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అమెజాన్ కార్చిచ్చుకు సంబంధించి 2019లో లియోనార్డో చేసిన పోస్టు కూడా సరైంది కాదన్నారు. 2003లో చోటు చేసుకున్న అమెజాన్ ఫారెస్ట్ ఘటనకు సంబంధించి పోస్టులు పెట్టడాన్ని అధ్యక్షుడు జైర్ బోల్సోనారో విమర్శలు చేశారు.

Read Also : Sandal Stolen: రూ.180 విలువైన చెప్పులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు: అందులో పెద్ద ట్విస్ట్