ఈ ఇల్లు రెంట్ నెలకు రూ.1.26 కోట్లు మాత్రమే..!

ఈ ఇల్లు రెంట్ నెలకు రూ.1.26 కోట్లు మాత్రమే..!

Building rent is over 1cr per month : ఓ ఇంటి అద్దె వింటే..కళ్లు తేలేయాల్సిందే. అసలు అది అద్దా? లేదా ఇల్లు ఖరీదా? అనే డౌట్ వస్తుంది. ఇంతకీ ఆ ఇంటి అద్దె ఎంతంటే..అక్షరాలా..రూ.1.26 కోట్లు..! ఏంటీ షాక్ అయ్యారా? అయ్యేఉంటార్లెండీ..ఎందుకంటే రెంట్ ఆ రేంజ్ లో ఉంది. మరి ఇంత భారీ స్థాయిలో రెంట్ ఉండే ఆ ఇంటి ప్రత్యేకతలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి..

ఇంటి అద్దెలు సాధారణంగా వేలల్లో ఉంటాయి. మన ఆర్థిక స్తోమతను బట్టి అద్దె ఇళ్లను సెలక్ట్ చేసుకుంటాం. ఇల్లు అద్దెకు తీసుకునేది ఎక్కువగా మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటారు. ధనవంతులైతే ఏకంగా ఇళ్లు కొనేసుకుంటారు. కానీ శ్రీమంతులు మాత్రమే అద్దెకు తీసుకునేలా ఉన్న లగ్జరీ హౌస్ హాంగ్‌కాంగ్‌లో ఉంది. రెంట్ రూ.1.26 కోట్లు..!

ఈ ఇల్లు మొత్తం మొత్తం 10,804 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఇంట్లో.. ఓ ప్రైవేట్ గ్యారేజ్, లిఫ్టు కూడా ఉన్నాయి. అంతేకాదు రకరకాల మొక్కలుంటే ఓ అందమైన తోట కూడా ఉంది. హాంగ్‌కాంగ్ లెక్కల్లో దీని నెలరోజుల అద్దె 1.35 మిలియన్ హాంగ్‌కాంగ్ డాలర్లు. ఈ భవనంలో నుంచి ఇక్కడి విక్టోరియా హార్బర్‌ స్పష్టంగా కనిపిస్తుందట. ఈ ఇంటి అద్దె హకాంగ్‌ దేశంలో అత్యధికమట. ఈ లెక్కన ఈ భవనం ఏడాది అద్దె రూ.15 కోట్లపైమాటే…