Cat In Baseball Game : ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్ లోకి అనుకోని అతిథి

బేస్ బాల్ ఆట ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో అనుకోని అతిధి గ్రౌండ్ లోకి వచ్చింది. దానిని చూసిన ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. ఇక దానిని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది విఫల ప్రయత్నం చేశారు. చివరికి ఓ చిన్న దారిలోంచి పారిపోయింది. కాగా ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ పిల్లి స్టేడియంలోకి ప్రవేశించింది.

Cat In Baseball Game : ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్ లోకి అనుకోని అతిథి

Cat In Baseball Game

Cat In BaseBall Game : మైదానంలో ఆసక్తికరణంగా ఆట సాగుతున్న సమయంలో చోటు చేసుకునే కొన్ని సరదా సంఘటనలు ప్రేక్షకులతోపాటు, ఆటగాళ్లకు నవ్వుతెప్పిస్తుంటాయి. కొన్ని సార్లు ఆట జరుగుతున్నా సమయంలో మైదానంలోకి హఠాత్తుగా జంతువులూ వస్తుంటాయి. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఆట చూడడం మానేసి ఆ జంతువులను చూస్తుంటారు.

ఇక సీరియస్ గా సాగే మ్యాచ్ లోకి ఏదైనా జంతువు కానీ.. నవ్వుతెప్పించే ఘటన కానీ చోటుచేసుకుంటే ఆటగాళ్లు కూడా కొద్దిసేపు తనం గ్రౌండ్ లో ఉన్న విషయం మరిచిపోయి నవ్వుకుంటారు. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన స్టేడియంలోని ప్రేక్షకులతోపాటు ఆటగాళ్లను విపరీతంగా నవ్విస్తుంది.

బేస్ బాల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది.. ఇంతలోనే ఓ పిల్లి స్టేడియంలోకి ప్రవేశించింది. దీంతో ప్రేక్షకులు తమ దృష్టిని పిల్లిపైకి మళ్లించారు. దానిని చూసి కేకలు వేయడం మొదలు పెట్టారు. కామెంటేటర్లు కూడా మ్యాచ్ గురించి చెప్పడం మరచిపోయి.. పిల్లి గురించి చెప్పడం మొదలు పెట్టారు. ఆటగాళ్లు ఓ వైపు నవ్వుతూనే మారోవైపు ఆటను కొనసాగించారు.

కాగా ఈ ఘటనఅమెరికాలో చోటుచేసుకుంది. సోమవారం న్యూయార్క్ యాంకీస్, బాల్టీమోర్ ఓరియోలెస్ మధ్య బేస్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. మైదానం మధ్యలోకి ఒక పిల్లి పరుగెత్తుకుంటూ వచ్చింది. దానిని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించారు. కానీ వారికీ అది దొరకలేదు.

స్టేడియం మొత్తం ఓ రౌండ్ వేసింది. అందులోంచి బయటపడేందుకు కార్నర్స్ మొత్తం వెతికింది. కానీ దానికి ఎక్కడ సందు కనిపించలేదు. దీంతో కొద్దీ నిమిషాల పాటు స్టేడియంలోని ఉండిపోయింది. స్టేడియం నుంచి బయటపడేందుకు పరుగులు తీసి అలసిపోయింది. కొద్దీ సేపటి తర్వాత డోర్ ఓపెన్ చేయడంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇక పిల్లి గ్రౌండ్ లో ఉన్నంత సేపు ప్రేక్షకులు దానిని చూస్తూ నవ్వుకున్నారు.

ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఓ పిల్లిని పట్టుకోలేకపోయారు.. ఎవరైనా దుండగులు వస్తే ఏంటి పరిస్థితి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.