Charles Sobhraj: 19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్న చార్లెస్ శోభరాజ్.. నేపాల్ కోర్టు ఆదేశం
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. అమెరికన్ జంట హత్యకు సంబంధించి చార్లెస్ శోభరాజ్ 2003 నుంచి నేపాల్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు.

Charles Sobhraj: కరుడుగట్టిన నేరస్తుడిగా గుర్తింపు పొందిన ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు శోభరాజ్‌ను విడుదల చేయాలంటూ నేపాల్ సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. ఫ్రెంచ్‌కు చెందిన చార్లెస్ శోభరాజ్ తల్లిదండ్రులు ఇండియా-వియత్నాం మూలాలు కలిగిన వాళ్లు.
Jane Zhang: కావాలని కోవిడ్ వైరస్ అంటించుకున్న చైనీస్ సింగర్.. కారణం తెలిసి తిడుతున్న నెటిజన్లు!
అయితే, 1975లో ఫేక్ పాస్ పోర్టు మీద నేపాల్ వెళ్లాడు. అక్కడ పర్యటనకు వచ్చిన ఇద్దరు అమెరికన్లను శోభరాజ్ హత్య చేశాడు. అమెరికాకు చెందిన జో బొరోంజిచ్ అనే వ్యక్తిని, అతడి ప్రేయసిని హత్య చేశాడు. అనంతరం అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. అప్పట్నుంచి అతడి కోసం నేపాల్ పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అతడు 2003లో నేపాల్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. విదేశీయుల హత్యకు సంబంధించి అతడిపై కోర్టు విచారణ జరిపింది. అతడు చేసిన నేరాన్ని పోలీసులు రుజువు చేశారు. దీంతో నేపాల్ కోర్టు అతడికి 21 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఫేక్ పాస్ పోర్టు కలిగి ఉన్నందుకు అప్పట్లో రూ.2,000 జరిమానా కూడా విధించింది.
దీంతో శోభరాజ్ 2003 నుంచి నేపాల్ జైల్లోనే ఉన్నాడు. అయితే, అతడి వయసును దృష్టిలో ఉంచుకున్న నేపాల్ కోర్టు శిక్ష పూర్తవ్వడానికి రెండేళ్ల ముందుగానే అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. జైలు నుంచి విడుదలైన 15 రోజుల్లోగా దేశం నుంచి పంపించి వేయాలని సూచించింది.