Jane Zhang: కావాలని కోవిడ్ వైరస్ అంటించుకున్న చైనీస్ సింగర్.. కారణం తెలిసి తిడుతున్న నెటిజన్లు!

చైనాలో ఒక సింగర్ చేసిన పని నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం వచ్చేలా చేసింది. దేశమంతా కోవిడ్‌తో వణికిపోతుంటే ఇదేం పిచ్చి పని అంటూ ఆమెపై విమర్శలు చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటారా? కావాలని కోవిడ్ అంటించుకుంది.

Jane Zhang: కావాలని కోవిడ్ వైరస్ అంటించుకున్న చైనీస్ సింగర్.. కారణం తెలిసి తిడుతున్న నెటిజన్లు!

Jane Zhang: కోవిడ్ వైరస్ సోకుతుందంటే ఎవరైనా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కోవిడ్ బారిన పడకుండా చూసుకుంటారు. కానీ, చైనాలోని ఒక గాయని మాత్రం కావాలని కోవిడ్ వైరస్ అంటించుకుంది. ఆమె చెప్పిన కారణం విని అంతా షాకయ్యారు. ఆమె చేసిన పనికి నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Kapu Reservation Bill: కాపుల రిజర్వేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. టీటీపీ ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుబాటు

ప్రస్తుతం చైనాలో కోవిడ్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. లక్షల్లో కేసులు నమోదువుతున్నాయి. రోజూ వేల మంది మరణిస్తున్నారు. ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఇలాంటి టైంలో ఎవరికి వారు తగినంత జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ, జేన్ జాంగ్ అనే ఒక చైనీస్ గాయని మాత్రం ఇటీవల కావాలని కరోనా వైరస్ అంటించుకుంది. కోవిడ్ బారిన పడింది. కరోనా సోకడానికి ఆమె చైనాలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగింది. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, మాస్క్ పెట్టుకోకుండా, కోవిడ్ అంటుకోవాలనే లక్ష్యంతోనే తిరిగింది. అనుకున్నట్లే ఆమెకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే, తాను ఇలా ఎందుకు చేసిందో కూడా చెప్పింది. జేన్ జాంగ్ చైనాలో మంచి సింగర్‌గా పేరు తెచ్చుకుంది.

DL Ravindra Reddy: వైసీపీలో ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉంది.. చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి

ఎంతో కాలంగా ఆమె సంగీతాభిమానుల్ని అలరిస్తుంది. వివిధ వేడుకల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తుంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే కొత్త సంవత్సరం సందర్భంగా జరిగే వేడుకల్లో ఆమె ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ సమయంలో జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి, కోవిడ్ సోకే అవకాశం ఉంది. దీంతో అప్పుడు ఎలాగూ కోవిడ్ సోకుతుందని భావించింది. పైగా ఆ టైంలోపు కోవిడ్ రాకపోతే… కోవిడ్ వస్తుందేమో అని టెన్షన్ పడాల్సి వస్తుందని అనుకుంది. అందుకే, ముందుగానే కోవిడ్ తెచ్చుకుని, కోలుకుంటే ప్రదర్శన టైంలో ఎలాంటి భయం ఉండదని ఇలా చేసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో వీడియో ద్వారా వెల్లడించింది. ఈ వీడియో బయటపడటం ఆలస్యం.. నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు.

బాధ్యత లేకుండా అలా ఎలా చేస్తావంటూ ప్రశ్నించారు. నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తుండటంతో ఆమె తన వీడియో డిలీట్ చేసింది. నెటిజన్లకు సారీ చెప్పింది. కాగా, తనకు ఒక్క రోజు మాత్రమే కోవిడ్ లక్షణాలు వచ్చాయని, తర్వాత అంతా మామూలుగానే ఉందని తెలిపింది.