Floods in China : 1000 ఏళ్లలో చైనాలో మొదటిసారి భారీ వరదలు..కొట్టుకుపోయిన వందలాది కార్లు..అతలాకుతలంగా డ్రాగన్ దేశం

డ్రాగన్ దేశం చైనా వరదలతో విలవిల్లాడిపోతోంది. గత 1000 ఏళ్లలోచైనాలో ఇంతా దారుణమైన వరదలు ముంచెత్తటం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. భారీగా వరదలకు వందలాది కార్లు..వేలాది వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఇంకా లెక్కలేనన్ని వాహనాలు నీటిలో మునిగిపోయాయి. లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Floods in China : 1000 ఏళ్లలో చైనాలో  మొదటిసారి భారీ వరదలు..కొట్టుకుపోయిన వందలాది కార్లు..అతలాకుతలంగా డ్రాగన్ దేశం

Floods In China

Floods in China in 1,000 years : డ్రాగన్ దేశం చైనా వరదలతో విలవిల్లాడిపోతోంది. గత 1000 ఏళ్లలోచైనాలో ఇంతా దారుణమైన వరదలు రాలేదు. ఈక్రమంలో భారీగా ముంచెత్తున్న వర్షాలతో వరదలు విరుచుకుపడ్డాయి. దీంతో వందలాది కార్లు..వేలాది వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఇంకా లెక్కలేనన్ని వాహనాలు నీటిలో మునిగిపోయాయి. లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా అయిపోయారు. ముఖ్యంగా చైనాలోని హెనాన్ ను వరదలు ముంచెత్తటంతో దారుణ పరిస్థిులు నెలకొన్నాయి. గత 1000 ఏళ్లలో ఎప్పుడూ లేనంతా వరదలు విరుచుకుపడ్డాయి. 1.60 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎక్కడి చూసినా వరదనీరు ఉప్పొంగిపోతోంది. అయినా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 457.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న క్రమంలో హెనాన్ ప్రావిన్స్ వరద నీటిలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. భారీ వర్షాల కారణంగా యెల్లో నది ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తోంది. ఇంతటి వరదల్లో కూడా కాస్త ఊరట కలిగించే విషయం ఏమిటంటే పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. ఇంత దారుణమైన వరదలు ముంచెత్తుతున్నా 25 మంది మరణించారు. 12.4 లక్షల మందిపై వరద ప్రభావం చూపింది.

మంగళవారం (జులై 21,2021)రాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో సబ్‌వే రైళ్లలోకి నడుములోతులో నీళ్లు ప్రవేశించాయి. ఈ ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారు. హెనాన్ ప్రావిన్స్ రాజధాని ఝెన్‌ఝూలో వరద నీటిలో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. 160 రైలు సర్వీసులను 260 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఐఫోన్ సిటీగా పిలిచే ఝెన్‌జూలో నిన్న ఒక్క రోజే ఏకంగా 457.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

ఇలా చైనాలో భారీ వర్షాలకు పోటెత్తుతున్న వరద వినాశం శనివారం నుంచి చూసుకుంటే సగటున 640.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇక్కడ గత వెయ్యేళ్లలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు, నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండడంతో అప్రమత్తమైన చైనా సైన్యం వరద నీటిని మళ్లించేందుకు హెనాన్ ప్రావిన్స్‌లోని యుచువాన్ కౌంటీలో దెబ్బతిన్న యిహెతన్ ఆనకట్టను పేల్చేసింది. చైనా వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.