సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించారని పౌరులను చైనా జైల్లో పెడుతోంది!

సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించారని పౌరులను చైనా జైల్లో పెడుతోంది!

China arrest citizens posting criticism social media : విదేశీ సోషల్ మీడియా పోస్టులతో ప్రభుత్వాన్ని విమర్శించే పౌరులను చైనా అరెస్ట్ చేసి జైల్లోపెడుతోందని  ది వాల్ స్ట్రీట్ జనరల్ నివేదిక ఒకటి వెల్లడించింది. డ్రాగన్ దేశంలో ఆయా పోస్టులు కూడా కనిపించవు. అయినప్పటికీ ప్రభుత్వంపై పౌరులు విమర్శలు చేయడాన్ని సహించలేని చైనా తమ దేశ పౌరులను అరెస్ట్ చేస్తోందని, దీనిపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ జనరల్ కథనంలో పేర్కొంది.

చైనా క్లోయిస్టర్డ్ ఇంటర్నెట్ వెలుపల కథనాలను నియంత్రించడానికి, విమర్శలు చేసేవారి గొంతు నొక్కడానికి డ్రాగన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని అక్కడి వారంతా ఆరోపిస్తున్నారని నివేదిక పేర్కొంది. అందుకే ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడితే వారికి జైలు శిక్షలు విధిస్తోందని ఆరోపిస్తున్నారని జర్నల్ నివేదిక వెల్లడించింది. చైనాలో ట్విట్టర్, ఇతర విదేశీ ప్లాట్‌ఫారమ్‌లను వాడినందుకు చైనా అధికారులు గత మూడేళ్లలో 50 మందికి పైగా జైలు శిక్ష విధించారు.

ట్విట్టర్ వినియోగదారులు సాధారణంగా వందలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో 30 కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ రాష్ట్ర నేతలు, కమ్యూనిస్ట్ పార్టీని విమర్శలు చేశారని, హాంకాంగ్, జిన్జియాంగ్ బీజింగ్ గురించి చర్చించినందుకు అరెస్టు చేశారు.

చైనాలో ఎక్కువ మంది పౌరులంతా వార్తల కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయించడంతో సోషల్ మీడియా కార్యకలాపాలపై ప్రభుత్వ నిఘా పెట్టింది. సైబర్‌ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా జనవరి 22న పబ్లిక్ ఇంటర్నెట్ అకౌంట్ల కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.