China-made Covid-19 vaccine: వీసా కావాలంటే వ్యాక్సిన్ మస్ట్, భారత్‌ సహా 20 దేశాల ప్రయాణికులకు వింత కండీషన్

విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే వారికి చైనా ఓ కండీషన్ పెట్టింది. ఆ కండీషన్ పాటిస్తేనే వీసాలు ఇస్తామని, తమ దేశంలోకి అనుమతిస్తాని అంటోంది. లేదంటే నో ఎంట్రీ అంటోంది. ఇంతకీ ఆ కండీషన్ ఏంటంటే.. ఆ దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలట. భారత్‌ సహా 20 దేశాల ప్రయాణికులకు ఈ నిబంధనను తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకుంది.

China-made Covid-19 vaccine: వీసా కావాలంటే వ్యాక్సిన్ మస్ట్, భారత్‌ సహా 20 దేశాల ప్రయాణికులకు వింత కండీషన్

China Made Covid 19 Vaccine

China-made Covid-19 vaccine: విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే వారికి చైనా ఓ కండీషన్ పెట్టింది. ఆ కండీషన్ పాటిస్తేనే వీసాలు ఇస్తామని, తమ దేశంలోకి అనుమతిస్తాని అంటోంది. లేదంటే నో ఎంట్రీ అంటోంది. ఇంతకీ ఆ కండీషన్ ఏంటంటే.. ఆ దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలట. భారత్‌ సహా 20 దేశాల ప్రయాణికులకు ఈ నిబంధనను తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఢిల్లీలోని తమ దేశ రాయబార కార్యాలయానికి నోటీసు పంపింది. మేడిన్ చైనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ ఉన్నవారికే వీసాలు ఇస్తామని, తమ దేశంలోకి అనుమతిస్తామని అందులో తెలిపింది. ఇలాంటి నోటీసులు మొత్తం 20 దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో ఏర్పాటు చేసినట్లు చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది.

కాగా, భారత్‌ సహా మరికొన్ని దేశాల్లో చైనా టీకాలు అందుబాటులో లేవు. అలాంటప్పుడు అక్కడకు వెళ్లాల్సినవారు చైనా టీకాను తీసుకోవడం ఎలా అన్న విషయాన్ని సదరు నోటీసుల్లో తెలపలేదు. చైనాలో చదువుతున్నవారితో పాటు ఉద్యోగాలు చేస్తున్న 23 వేల మందికిపైగా భారతీయులు కరోనా పరిస్థితులతో గతేడాది తిరిగొచ్చారు. వారు తిరిగి చైనాకు వెళ్లడానికి ఎదురుచూస్తున్నారు. చైనా కొత్త నిబంధనతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు.

కాగా, చైనా వ్యాక్సిన్ ఎంతవరకు సేఫ్ అన్నదానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అంతేకాదు మేడిన్ చైనా కొవిడ్ వ్యాక్సిన్ పై అనేక అనుమానాలు, సందేహాలు, భయాలు ఉన్నాయి. చైనాలో తయారైన వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చెయ్యడం లేదన్న వార్తలూ వచ్చాయి. ఈ క్రమంలో మేడిన్ చైనా కొవిడ్ వ్యాక్సిన్ మస్ట్ అనే నిబంధన విదేశీయుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. మేడిన్ చైనా వ్యాక్సిన్ తీసుకున్నాక తమ ప్రాణానికి ఎలాంటి ముప్పు కలుగుతుందోనని కంగారుపడుతున్నారు.