కొంపముంచిన సేమ్ బ్లడ్ గ్రూప్.. తాను మహిళ కాదు మగాడు అని 25ఏళ్ల తర్వాత తెలిసింది

చైనాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. తల్లిదండ్రుల సేమ్ బ్లడ్ గ్రూప్ ఆమె పాలిట శాపమైంది. బయటకు మహిళలా కనిపిస్తున్నా.. ఆమె కాదు అతడు అనే నిజం బయటపడింది.

కొంపముంచిన సేమ్ బ్లడ్ గ్రూప్.. తాను మహిళ కాదు మగాడు అని 25ఏళ్ల తర్వాత తెలిసింది

Born Man

China Married woman finds she was born man: చైనాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. తల్లిదండ్రుల సేమ్ బ్లడ్ గ్రూప్ ఆమె పాలిట శాపమైంది. బయటకు మహిళలా కనిపిస్తున్నా.. ఆమె కాదు అతడు అనే నిజం బయటపడింది. తాను మహిళ కాదు మగాడు అనే వాస్తవం ఆమెకు 25ఏళ్ల తర్వాత తెలిసింది. తాను ఇన్నాళ్లు సంసారం చేసింది మహిళతో కాదు పురుషుడితో అని తెలిసి ఆ భర్త మైండ్ బ్లాంక్ అయ్యింది. మొత్తంగా అందరికి దిమ్మ తిరిగిపోయింది.

ఆమె పేరు పింగ్‌పింగ్‌. చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌ లో నివాసం ఉంటోంది. పింగ్ కు పెళ్లైంది. చాలా హ్యాపీగా జీవితం గడుపుతోంది. కానీ, పిల్లలు కలగట్లేదనే ఒకే ఒక్క బాధ ఆమె వేధిస్తోంది. దాంతో పింగ్ దంపతులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇంతలో ఆమె కాలికి గాయమైంది. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా షాకింగ్ నిజం బయటపడింది. ఇన్నాళ్లు మహిళగా భావిస్తున్న ఆమె, అసలు మహిళే కాదని తేలింది. పురుషుడిగా జన్మించి జన్యులోపం కారణంగా మహిళగా మారిందని డాక్టర్లు గుర్తించారు. పాతికేళ్ల తర్వాత నిజం తెలుసుకుని మహిళతోపాటు అందరూ ఆశ్చర్యపోయారు.

సాధారణంగా అమ్మాయిలకు కౌమరదశకు రాగానే రుతుస్రావం మొదలువుతుంది. కానీ, పింగ్‌పింగ్‌ విషయంలో అలా జరగలేదు. దీంతో డాక్టర్లను సంప్రదిస్తే.. శరీరంలో ఎదుగుదల నెమ్మదిగా ఉందని.. సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని చెప్పారట. ఆ ధీమాతోనే ఆమెకు తల్లిదండ్రులు వివాహం చేసేశారు.

అయితే, కొంతకాలంగా సంతానం కోసం పింగ్ ప్రయత్నిస్తోంది. అయినా గర్భం దాల్చట్లేదు. ఇంతలో ఆమె కాలికి దెబ్బతగలడంతో కుటుంబసభ్యులు యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కాలికి ఎక్స్‌-రే తీయగా.. ఆమె శరీరంలో ఎముకలు ఎదగలేదని డాక్టర్లు గుర్తించారు. వారికి ఎక్కడో అనుమానం వచ్చింది. అంతే, మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో విస్తుపోయే విషయం తెలిసింది.

వైద్య నివేదికలో ఆమెలో గర్భాశయం, అండాశయం లేదని కూడా తేలింది. ఆ మహిళ పుట్టడంతోనే సరిగా ఎదగని స్త్రీ, పురుష జననాంగాలతో పుట్టిందట. దీంతో బాహ్యశరీరం మహిళగా కనిపిస్తున్నా జన్యుపరంగా ఆమె పురుషుడని డాక్టర్లు తెలిపారు. అందుకే ఆమెకు రుతుస్రావం అవ్వట్లేదని వివరించారు. దీనికి కారణం జన్యులోపం అని డాక్టర్లు తేల్చారు. ఆమె తల్లిదండ్రులు ఒకే బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్లు కావడం వల్ల ఈ జన్యులోపం తలెత్తిందని చెప్పారు.