Bullet Train: చైనా పన్నాగం..సరిహద్దులో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభం

సరిహద్దులకు సైనికులను తరలించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సిచువాన్-టిబెట్‌ రైల్వే పరిధిలోకి వచ్చే నింగ్చీ సెక్షన్‌లో ఈ బుల్లెట్ రైలు పరుగులు తీయబోతోంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉంటుంది.

Bullet Train: చైనా పన్నాగం..సరిహద్దులో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభం

Bullet Train

Bullet Train: చైనా సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతోంది. తరచు ఎదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటుంది. మొన్నటివరకు సరిహద్దుల్లో బలగాలను మోహరించి భారత్ ను భయపెట్టాలని చూసింది. కానీ భారత్ అందుకు దీటుగా సమాధానం చెప్పడంతో తోకముడిచింది.

ఇక ఇప్పుడు టిబెట్ రాజధాని లాసా నుంచి భారత్ కు అత్యంత సమీపంలో ఉండే న్యింగ్చి ప్రావిన్సులకు బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు సమీపంలో ఉన్న నింగ్చీకి బుల్లెట్‌ ట్రైన్ ప్రారంభించడం ద్వారా చైనా వ్యూహాత్మక అడుగు వేసినట్లయింది. సరిహద్దుల్లో పట్టుబిగించేందుకే చైనా ఈ ట్రైన్ ప్రారంభించినట్లు తెలుస్తుంది.