ముక్కుకు బదులుగా మలద్వారం నుంచే కరోనా పరీక్షలు

ముక్కుకు బదులుగా మలద్వారం నుంచే కరోనా పరీక్షలు

Anal Swab Test: చైనా స్టేట్ మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. చైనాలో ఓరల్ (నోరు, ముక్కు) ద్వారా శాంపుల్ తీసి పరీక్ష జరిపే టెక్నిక్ కు బదులుగా మరొకటి వాడేస్తున్నారు. మల ద్వారం (ఆనల్) నుంచి శాంపుల్స్ తీసి పరీక్ష జరపడం వల్ల కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారట.

కొన్నిసార్లు జరిపే పరీక్షల్లో ఇన్ఫెక్షన్ ఫలితాలు మిస్ అయిపోవచ్చు. అదే ఎక్స్‌ట్రా ఆనల్ స్వాబ్ తీయడం వల్ల గుర్తించడం చాలా సులువు అవుతుందని బీజింగ్ యువాన్ హాస్పిటల్ లోని అసోసియేట్ డైరక్టర్ లీ టాంగ్ జెంగ్ అంటున్నారు.

ఈ మేరకు జరిపిన కొన్ని స్టడీల వివరాలు కూడా వెల్లడించారు. కరోనావైరస్ అనేది మల ద్వారంలో మలం రూపంలో చాలా సేపు ఉంటుంది. గొంతులో ముక్కులో 3నుంచి 5రోజులు మాత్రమే ఉండటంతో దానిపై పరీక్షలు జరపడం కంటే ఈ టెక్నిక్కే బెటర్ అంటున్నారట.

ఆనల్ స్వాబ్స్ అనేవి చాలా వరకూ కరెక్ట్ గానే ఉంటాయి. ప్రత్యేకించి క్వారంటైన్ లో ఉన్న వారు, హై రిస్క్ తో కూడిన వారు తప్పకుండా ముక్కు, గొంతు శాంపుల్స్ కు బదులు ఇలా చేయాలి. ‘ఆనల్ స్వాబ్ నుంచే అనుకున్నది క్లియర్ గా సాధించగలం. అని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్స్ పర్ట్ డా. సంజయ సేననయకే అంటున్నారు.

చైనా సోషల్ మీడియా కొవిడ్ 19పై తీసుకొచ్చిన కొత్త ప్రచారం ఇలా ఉంది. బీజింగ్ బయట ఉన్న గువాంజౌ ప్రాంతంలో దక్షిణకొరియా వెళ్లి వచ్చిన కారణంగా క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారు ‘సిగ్గుపడ్డాం. ఇంకేం ఫీలింగ్స్ లేవు.. గుడ్ లక్’ అంటూ స్పందిస్తున్నారు.

అక్కడ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో నార్మల్ గానే పండుగ రోజుల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని… రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగకూడదని సూచిస్తున్నారు. అలా వచ్చిన వారి కొందరిలో ముక్కు నుంచి తీసేశాంపుల్స్ లో కచ్చితమైన ఫలితాలు రాలేకపోతుండటంతో మలంతో వచ్చే శాంపుల్స్ కే ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందన్నారు.