కోట్లు కుప్పలుగా పోసి : ఉద్యోగులకు లక్షల్లో బోనస్

కోట్లు కుప్పలుగా పోసి : ఉద్యోగులకు లక్షల్లో బోనస్

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీలు బోనస్ లు ఇవ్వడం వెరీ కామన్. ఏ పండుగకో.. కంపెనీ యానివర్శరీకో ఉద్యోగులకు బోనస్ లు ప్రకటిస్తుంటారు.

కోట్లు కుప్పలుగా పోసి : ఉద్యోగులకు లక్షల్లో బోనస్

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీలు బోనస్ లు ఇవ్వడం వెరీ కామన్. ఏ పండుగకో.. కంపెనీ యానివర్శరీకో ఉద్యోగులకు బోనస్ లు ప్రకటిస్తుంటారు.

తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కంపెనీలు బోనస్ లు ఇవ్వడం వెరీ కామన్. ఏ పండుగకో.. కంపెనీ యానివర్శరీకో ఉద్యోగులకు బోనస్ లు ప్రకటిస్తుంటారు. బోనస్ అంటే.. మహా అయితే ఐదో.. పదివేలో ఇస్తారు. ఇందులో కొత్తేమి ఉంది అనుకుంటున్నారా? ఐదో, పదివేలు బోనస్ ఇస్తే పరవాలేదు. కానీ, ఏకంగా లక్షల రూపాయలను బోనస్ ఇచ్చారంటే కొత్తే కదా మరి. ఏడాది అంతా పని ఒత్తిడితో విసిగిపోయిన ఉద్యోగులకు ఏడాది చివరిలో ఇలా సర్ ఫ్రైజ్ బోనస్ ఇచ్చి ఫిదా చేసిందో చైనాకు చెందిన కంపెనీ. చైనాలోని జియాంగ్సీ ప్రావిన్స్ లో స్టీల్ ప్లాంట్ కంపెనీ.. తమ సంస్థలో పనిచేసే 5వేల ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి 60వేలు యాన్స్ (అంటే.. రూ. 6.2 లక్షలు) బోనస్ గా ప్రకటించింది.

ఇందుకోసం ముందుగా కంపెనీ యాజమాన్యం 300 మిలియన్ల యాన్స్ (రూ.313.41 కోట్లు) నోట్లను గుట్టలుగా పోసింది. మౌంటైన్ మాదిరిగా నోట్ల కట్టలను పేర్చింది. ఉద్యోగులకు సరదాగా ఓ పోటీ పెట్టింది. ఇచ్చిన సమయంలోగా 6.2 లక్షల మొత్తాన్ని దక్కించుకోవాల్సి ఉంటుంది. లక్షల్లో బోనస్ పొందిన ఉద్యోగులంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ లక్షల రూపాయలను ఎలా ఖర్చు పెట్టాలో తెలియడం లేదని చెబుతున్నారు.  

చైనాలోని కంపెనీల్లో ఉద్యోగులకు ఇలా పెద్ద మొత్తంలో బోనస్ లు ఇవ్వడం తొలిసారి కాదు. గతంలో ఓ చైనా కంపెనీ కూడా తమ ఉద్యోగులకు గేమ్ షో నిర్వహించింది. ఈ షోలో నోట్ల కట్టలను కుప్పలుగా పేర్చింది. నిర్ణీత సమయంలోగా ఎవరైతే ఎన్ని నోట్ల కట్టలను తీసుకుంటారో వారికే ఆ డబ్బు అంతా దక్కుతుంది. మనదేశంలోని కంపెనీల్లో కూడా ఇలాంటి బోనస్ లు ఇస్తే బాగుండు.. అనిపిస్తుంది కదా. 

×