China : 10 అంతస్తుల భవనం.. 28 గంటల్లో నిర్మాణం

సాధారణంగా ఓ 10 అంతస్తుల భవనం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ? కాంట్రాక్టర్‌తో పాటు కార్మికులు కూడా స్పీడ్‌గా ఉంటే మూడేళ్లైనా పడుతుంది. అదే బిల్డింగ్‌ నిర్మాణం నత్తనడకన సాగితే కనీసం నాలుగేళ్లైనా పడుతుంది. చేతిలో డబ్బు, మెటిరీయల్‌ అన్ని సిద్ధంగా ఉన్నప్పటికి నిర్మాణం పూర్తి కావడానికి ఏడాదైనా పడుతుంది. అలాంటిది 10 అంతస్తుల నిర్మాణాన్ని కేవలం 28 గంటల్లోనే పూర్తి చేశారు.

China : 10 అంతస్తుల భవనం.. 28 గంటల్లో నిర్మాణం

China

10 Storey Building : సాధారణంగా ఓ 10 అంతస్తుల భవనం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ? కాంట్రాక్టర్‌తో పాటు కార్మికులు కూడా స్పీడ్‌గా ఉంటే మూడేళ్లైనా పడుతుంది. అదే బిల్డింగ్‌ నిర్మాణం నత్తనడకన సాగితే కనీసం నాలుగేళ్లైనా పడుతుంది. చేతిలో డబ్బు, మెటిరీయల్‌ అన్ని సిద్ధంగా ఉన్నప్పటికి నిర్మాణం పూర్తి కావడానికి ఏడాదైనా పడుతుంది. అలాంటిది 10 అంతస్తుల నిర్మాణాన్ని కేవలం 28 గంటల్లోనే పూర్తి చేశారు. మనుషులు నివసించే అపార్ట్‌మెంట్‌ను కేవలం 28 గంటల్లో నిర్మించి అందరిని ఆశ్చర్యపరిచారు. అది ఎక్కడో కాదు డ్రాగన్ కంట్రి చైనాలో.

చారిత్రక కట్టడాలు, ప్రపంచంలో గొప్పగా నిర్మాణాలు చేసే ఘనత చైనా సొంతం. 10 రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించి అప్పట్లో సంచలనం సృష్టించిన డ్రాగన్ కంట్రి.. మరోసారి అదే తరహా సీన్ రిపీట్‌ చేసింది.
చైనాకు చెందిన బ్రాడ్‌ గ్రూప్‌ కంపెనీ ఈ రికార్డును సృష్టించింది. పది అంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణం కోసం బ్రాడ్‌ కంపెనీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీని ఉపయోగించి కేవలం 28 గంటల వ్యవధిలో 10 అంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణం పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఫ్యాక్టరీలో ముందుగానే నిర్మించిన చిన్న విభాగాలను సమీకరించడం ద్వారా దీని నిర్మాణం పూర్తి చేశారు.

ఇక ఈ 10 అంతస్తుల భవనం నిర్మాణం కోసం ముందుగానే నిర్మించించిన కంటైనర్‌ సైజ్‌ బ్లాక్స్‌ను తీసుకువచ్చారు. వాటన్నింటిని ఒకదాని మీద ఒకటి పేర్చి.. బిల్డింగ్‌ నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత బోల్ట్స్‌ బిగించి.. వాటర్‌, కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. ఇక ఈ మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి 28 గంటల 45 నిమిషాల సమయం పట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటివి చేయడం చైనాకే సాధ్యమంటూ మెచ్చుకుంటున్నారు.