Woman Sells Dumplings : కోమాలో ఉన్న భర్త .. ఆస్పత్రి బిల్లులు కట్టటానికి కుడుములు అమ్ముతున్న భార్య

ఓ భార్య కోమాలో ఉన్న త‌న భ‌ర్త‌ను బ‌తికించుకోవటానికి నానా కష్టాలు పడుతోంది. కోమాలో ఉన్న భ‌ర్త‌ను బ‌తికించుకోవ‌డాని..ఆస్పత్రి బిల్లులు కట్టటానికి కుడుములు అమ్ముతూ..పైసా పైసా కూడబెడుతోంది. ఓ పక్క భర్త ఆరోగ్యం..మరోపక్క ఇద్దరు పిల్లల బాధ్యత..

Woman Sells Dumplings : కోమాలో ఉన్న భర్త .. ఆస్పత్రి బిల్లులు కట్టటానికి కుడుములు అమ్ముతున్న భార్య

Chinese Woman Sells Dumplings

Chinese Woman Sells Dumplings : ఓ భార్య కోమాలో ఉన్న త‌న భ‌ర్త‌ను బ‌తికించుకోవటానికి నానా కష్టాలు పడుతోంది. కోమాలో ఉన్న భ‌ర్త‌ను బ‌తికించుకోవ‌డాని..ఆస్పత్రి బిల్లులు కట్టటానికి కుడుములు అమ్ముతూ..పైసా పైసా కూడబెడుతోంది. ఓ పక్క భర్త ఆరోగ్యం..మరోపక్క ఇద్దరు పిల్లల బాధ్యతవెరసి కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది చైనాకు చెందిన ఓ మహిళ జీవితం. అలా తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటునే మరోపక్క ఆస్పత్రిలో కోమాలో ఉన్న భర్త కోసం 71ల‌క్ష‌ల రూపాయాలు (6,00,000 యువన్లు)ఖ‌ర్చు చేసింది. డబ్బుల కోసం రాత్రి పగలు అనే తేడా కూడా మర్చిపోయింది. కుడుములు తయారు చేస్తూ వాటిని అమ్ముతు వచ్చిన డబ్బుల్ని ఆస్పత్రి బిల్లులు కడుతోంది. తను ఎంత కష్టపడినా ఫరవాలేదు..భర్త ఆరోగ్యంగా తిరిగి వస్తే చాలు అని కోటి దేవుళ్లకు మొక్కుకుంటోంది..

చైనా జియాంగ్సీ ప్రావిన్స్‌లోని అనై కంటీకి చెందిన ‘నీ’ అనే మ‌హిళ‌కు డింగ్ అనే వ్య‌క్తితో 2016లో వివాహ‌మైంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. పెళ్లి త‌ర్వాత కుటుంబం కోసం భార్యాభర్తలిద్దరు హోమ్‌మేడ్ నూడిల్స్, కుడుములు త‌యారు చేసి అమ్మేవారు. డోర్ డెలివరీ కూడా చేసేవారు. అలా వచ్చిన చిన్నపాటి సంపాదనతో ఇద్దరు ముద్దులొలికే పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితం యాక్సిడెంట్ రూపంలో కష్టాల సుడిగుండంలో పడిపోయింది. గత సెప్టెంబ‌ర్‌ (2022)లో నూడిల్స్, కుడుముల‌ను హోం డెలివ‌రీ చేస్తుండ‌గా..డింగ్ రోడ్డుప్ర‌మాదానికి గురయ్యాడు. దీంతో అత‌ను మెద‌డు తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటినుంచి నీ భ‌ర్త డింగ్‌ను బ‌తికించుకునేందుకు ఇల్లును అమ్మేసింది నీ. అయిన అత‌ని వైద్యానికి డ‌బ్బులు స‌రిపోవ‌డం లేదు. దీంతో మ‌ళ్లీ సొంతంగా కుడుములు త‌యారు చేయ‌డం వాటిని అమ్మగా వచ్చిన డబ్బుల్ని కూడబెడుతోంది. ఆస్పత్రి ఖర్చులు..ఇద్దరు పిల్లలు బాధ్యత చూసుకుంటోంది.

ఇటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న నీ భర్త ఆరోగ్యంగా తిరిగి వస్తాడనే నమ్మకంతోనే జీవిస్తోంది. నేను నా భ‌ర్త కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన ఆరోగ్యంగా మునుపటిలా తిరిగి వస్తాడని..మా కుటుంబం గతంలోలా సంతోషంగా ఉంటామని నమ్ముతున్నాను. నా భర్త ఆరోగ్యం కోసం ఎంతైనా కష్టపడతాను. సంవ‌త్స‌రం, రెండేళ్లు కాదు ఎన్నాళ్లైనా కష్టపడతా..డింగ్ ఆరోగ్య ప‌రిస్థితి క్ర‌మ‌క్ర‌మంగా మెరుగుప‌డుతోంది. అదే నాకు కావాల్సింది. అత‌ను పూర్తిగా కోలుకుంటాడ‌న్న న‌మ్మ‌కం నాకు ఉంది అని ఎంతో నమ్మకంగా తెలిపింది. నా భర్త వైద్యానికి ఇప్ప‌టి వ‌ర‌కు డింగ్ ఆరోగ్యం కోసం రూ. 71 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు నీ తెలిపారు.