Chris Cairns : మాజీ క్రికెటర్‌కు పక్షవాతం, ఆందోళనలో కుటుంబసభ్యులు

న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్‌ క్రిస్ కెయిన్స్ ప‌క్ష‌వాతం బారినపడ్డాడు. ఆస్ట్రేలియాలో గుండె ఆపరేషన్ చేసేటప్పుడు కెయిన్స్ కు పక్షవాతం వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు.

Chris Cairns : మాజీ క్రికెటర్‌కు పక్షవాతం, ఆందోళనలో కుటుంబసభ్యులు

Chris Cairns

Chris Cairns : న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్‌ క్రిస్ కెయిన్స్ ప‌క్ష‌వాతం బారినపడ్డాడు. ఆస్ట్రేలియాలో గుండె ఆపరేషన్ చేసేటప్పుడు కెయిన్స్ కు పక్షవాతం వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. ఎమర్జెన్సీగా సర్జరీ చేసేటప్పుడు వెన్నెముకలో స్ట్రోక్ వచ్చి కాళ్లు చచ్చు పడిపోయాయని చెప్పారు. అతనికి రిహాబిలిటిషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.

కెయిన్స్ ఆరోటిక్ డిసెక్షన్ తో (గుండె సంబంధ జ‌బ్బు) బాధపడుతున్నాడు. వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నాడు. తాజాగా గుండె ఆప‌రేష‌న్ చేస్తున్న స‌మ‌యంలో స్ట్రోక్ వ‌చ్చి, కాళ్ల‌కు ప‌క్ష‌వాతం వ‌చ్చింది. ఈ నెల మొద‌ట్లో క్యాన్‌బెరాలోని హాస్పిట‌ల్‌లో కెయిన్స్ ను అడ్మిట్ చేయ‌గా.. స‌ర్జ‌రీ కోసం సిడ్నీకి త‌ర‌లించారు. అక్క‌డ అత్య‌వ‌స‌రంగా స‌ర్జ‌రీ నిర్వ‌హించినా.. ఇప్పుడు కాళ్లకు ప‌క్ష‌వాతం రావ‌డంతో కెయిన్స్ ఇప్ప‌ట్లో కోలుకునేలా క‌నిపించ‌డం లేదు.

కాళ్లు చ‌చ్చుబ‌డిపోవ‌డంతో ఆస్ట్రేలియాలోనే మ‌రో స్పెష‌లిస్ట్ హాస్పిట‌ల్‌లో కెయిన్స్‌కు రీహాబిలిటేష‌న్ ప్ర‌క్రియ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు చెప్పారు. సిడ్నీలో స‌ర్జ‌రీ త‌ర్వాత కెయిన్స్‌ను కుటుంబ స‌భ్యులు మ‌ళ్లీ క్యాన్‌బెరాకు తీసుకొచ్చారు. ఈ క‌ష్ట స‌మ‌యంలో కెయిన్స్ కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న అంద‌రికీ కుటుంబ స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కెయిన్స్ వయసు 51 ఏళ్లు.

అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్ కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్ లో 62 టెస్టులు, 215 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 3,320 పరుగులు చేయడంతో పాటు 218 వికెట్లు తీశాడు. వన్డేల్లో 4,950 రన్స్ చేయడంతో పాటు 201 వికెట్లు పడగొట్టాడు. కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేసేవాడు. ప్ర‌పంచ మేటి ఆల్‌రౌండ్‌ల‌లో ఒక‌డిగా కెయిన్స్ గుర్తింపు పొందాడు.