Climate change increase mortality rate: పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు… మనుషుల ఆయుష్షు తగ్గిపోతుందని హెచ్చరిస్తున్న పరిశోధకులు
రాత్రి వేళల్లో పెరుగుతున్న వేడి వల్ల.. మనిషి క్రమత్వం దెబ్బతిని ఆయువు తగ్గుతోందని నార్త్ కరోలినా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. రాత్రి సమయాల్లో పెరుగుతున్న వేడి.. నిద్రను దెబ్బతిసి.. గుండె సంబంధమైన, మానసిక సమస్యలతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతోందని పరిశోధనల్లో తేలటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Climate change may increase mortality rate
Climate change may increase mortality rate : ఓ వైపు పొల్యూషన్ పెరుగుతూనే ఉంది. మరోవైపు.. గ్లోబల్ వార్మింగ్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూనే ఉంది. వీటికి తోడు.. క్లైమేట్ ఛేంజ్.. మానవాళి మనుగడకు ఎప్పటికప్పుడు సవాల్ విసురుతూనే ఉంది. ఈ ఆందోళనల మధ్యే.. రాత్రిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయ్. రాబోయే కొన్నేళ్లలో.. మనుషుల్లో మరణాలు మరింత పెరుగుతాయన్న రీసెర్చ్.. ఇప్పటికే ఉన్న భయాన్ని డబుల్ చేస్తోంది. రానున్న కొన్నేళ్లలో.. రాత్రి పూట సగటు ఉష్ణోగ్రతలు పెరిగితే.. కనిపించబోయే సీనేంటి? భవిష్యత్‌లో.. మానవాళి ఎదుర్కోబోయే విపత్కర పరిస్థితులేంటి?
రాత్రిళ్లు మీకు సరిగా నిద్రపట్టట్లేదా? ఫ్యాన్ స్పీడ్ మొత్తం పెంచినా.. వేడిగానే అనిపిస్తోందా? గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. సడన్‌గా మెలకువ వచ్చేస్తోందా? దీనంతటికి కారణం.. రాత్రిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలే. రాత్రి పూట బాగా నిద్రపట్టాలంటే.. పరిసరాలు చల్లగా ఉండాలి. కానీ.. ఈ మధ్యకాలంలో.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయ్. వాటి కారణంగా.. దీర్ఘకాలంలో.. ఆరోగ్యపరమైన సమస్యలు పెరిగే అవకాశముంది ఓ రీసెర్చ్‌లో తేలింది. అందులో వచ్చిన ఫలితాలు.. ప్రపంచ దేశాల్లో ఆందోళన రేపుతున్నాయ్.
ఈ రకమైన పరిశోధనలను.. చాలావరకు మనం సీరియస్‌గా తీసుకోం. కానీ.. ఏళ్లు గడుస్తున్న కొద్దీ.. వాతావరణం మారుతున్నకొద్దీ.. పరిస్థితుల్లో మార్పులు వస్తున్న కొద్దీ.. మనకు విషయం అర్థమవుతుంది. అప్పటికి.. మనం చేసేదేమీ ఉండదు. క్లైమేట్‌లో వచ్చే మార్పులకు.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీనిని మనం ఆపలేకపోయినా.. కనీసం ముందు జాగ్రత్త అయినా పడే సమయం కూడా ఉండదు. అందువల్ల.. కొన్ని కొన్ని పరిశోధనలను.. పట్టించుకోకుండా ఉండటం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. తాజాగా బయటకొచ్చిన ఓ రీసెర్చ్ ఫలితాలు.. మానవాళి మొత్తాన్ని హెచ్చరిస్తున్నాయ్.
రాత్రి వేళల్లో పెరుగుతున్న వేడి వల్ల.. మనిషి క్రమత్వం దెబ్బతిని ఆయువు తగ్గుతోందని నార్త్ కరోలినా యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చ్‌లో తేలింది. రాత్రి సమయాల్లో పెరుగుతున్న వేడి.. నిద్రను దెబ్బతిసి.. గుండె సంబంధమైన, మానసిక సమస్యలతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతోందని తేల్చారు. దీని వల్ల.. మనుషులు మరణించే ముప్పు.. రాబోయే 100ఏళ్లలో ఆరు రెట్లు పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇదే.. ఇప్పుడు ఆందోళన రేపుతోంది.
రాత్రివేళల్లో పెరిగే టెంపరేచర్ వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుందని.. తక్కువగా నిద్ర పోవడం వల్ల.. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్నారు. 2100 సంవత్సరం నాటికి.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల దాకా పెరుగుతాయని రీసెర్చ్‌లో తేలింది. తూర్పు ఆసియాలోని 28 ప్రధాన నగరాలలో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాత్రి వేళలో పెరిగే వేడి.. మనిషి ఆయుష్షును తగ్గిస్తుందని.. దీని వల్ల చిన్న వయసులోనే మరణించే వారి సంఖ్య అధికమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. చైనా, సౌత్ కొరియా, జపాన్ దేశాల్లో UNC గిల్లింగ్స్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో.. ఇలాంటి మరణాలు అధికంగా ఉన్నట్లు తేలింది.
క్లైమేట్ ఛేంజ్ వల్ల.. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించి.. అది అధిక మరణాలకు దారితీస్తుందని చెప్పిన మొదటి అధ్యయనం ఇదే. సగటు రోజువారీ ఉష్ణోగ్రతల పెరుగుదలతో పోలిస్తే..రాబోయే రోజుల్లో టెంపరేచర్ ఎంత మేర పెరుగుతుందన్న దానితో అంచనా వేశారు. ఆ లెక్కన.. మరణాల భారం మరింత ఎక్కువగా ఉంటుందని.. రీసెర్చ్‌లు చెబుతున్నాయ్. పారిస్ వాతావరణ ఒప్పందంలోని పరిమితులను దాటి.. ఉష్ణోగ్రతలు పెరిగి.. ప్రభావం అధికంగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి.. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కలిగే నష్టాలను.. తరచుగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఈ రీసెర్చ్‌లో తేలిందేమిటంటే.. రోజువారీ సగటు ఉష్ణోగ్రత మార్పుల కంటే.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతున్నట్లు కనుగొన్నారు. రోజువారీ టెంపరేచర్‌లో 20 శాతం కంటే తక్కువ పెరుగుదలతో పోలిస్తే.. వేడి రాత్రుల ఫ్రీక్వెన్సీ, సగటు తీవ్రత.. 2100 సంవత్సరం నాటికి 30 నుంచి 60 శాతానికి పెరుగుతుంది. దాని వల్ల.. రాబోయే శతాబ్ద కాలంలో.. ప్రస్తుతమున్న మరణాలు 60 శాతం మేర పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది.. క్లైమేట్ ఛేంజ్ నమూనాలు సూచించిన సగటు మరణాల కంటే.. చాలా ఎక్కువ.