Viral Pic : పాము నవ్వడం చూశారా?అయితే చూడండీ..
పాములు బుసలు కొడతాయి. పడగ విప్పుతాయి. కానీ పాములు నవ్వుతాయా? అంటే ఇంపాజిబుల్ అంటారు. కానీ ఓ పాము చూడండీ ఎంత బాగా నవ్వుతోందో?

Smile Snake
laughing snake viral pic : పాములు బుసలు కొడతాయి. పడగ విప్పుతాయి. కానీ పాములు నవ్వుతాయా? అంటే ఇంపాజిబుల్ అంటారు. కానీ ఓ పాము చూడండీ ఎంత బాగా నవ్వుతోందో? ఏంటీ పామేంటీ నవ్వటమేంటీ జోకా? అనుకోవద్దు. ఇదిగో ఈ ఫోటో చూస్తే మీరు కూడా అంటారు?అరె పాము భలే నవ్వుతోందే’అని. ఈ ఫోటోలో పాముని చూస్తే ఎవ్వరికైనా అలాగే అనిపిస్తుంది. పాము నవ్వుతున్నట్లుగా ఉన్న ఈ ఫోటో కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పురస్కారాలకు ఎంపికైంది.
జంతువులు, పలు రకాల ప్రాణులకు సంబంధించిన ఫన్నీ ఫొటోలు తీసేవారి కోసం ఏటా కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పురస్కారాలను అందజేస్తుంది. ఈ ఏడాది మొత్తం7 వేల ఎంట్రీలు రాగా.. అందులోని 42 చిత్రాలను ఫైనలిస్టులుగాజ్యూరీ ఎంపిక చేసింది. అందులో ఇదిగో ఈ వైన్ స్నేక్ ఫొటో కూడా ఒకటి. ఈ పాము ఫోటోని మన భారత్‌కు చెందిన ఆదిత్య అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు.
‘ఆ పాము దగ్గరికి ఎవరైనా వెళ్తే.. భయపెట్టటానికి..తనను తాను కాపాడుకోవటానికి ఇలా దాని నోరును పెద్దగా తెరుస్తుంది. కానీ మరి ఆ పాము ఎవరిని భయపెట్టటానికి అలా పెద్దనోరు తెరించిందో గానీ మన ఆదిత్యా ఠక్కుమని క్లిక్ చేసి తన కెమెరాలో బంధించారు. ’భయపెట్టటానికి నోరు తెరిచినా.. చూడ్డానికి నవ్వుతున్నట్లుగా కనిపిస్తోంది‘ అని ఆదిత్య అన్నారు. ఈ లాఫింగ్ స్నేక్‌తో పాటు మరెన్నీ ఫన్నీ ఫన్నీ ఫోటోలు ఈ ఏడాది కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పురస్కారాలకు ఎంపికయ్యాయి.