China Corona Cases : ఒక్కరోజే 33వేల కరోనా కేసులు.. చైనాలో మళ్లీ కొవిడ్ విశ్వరూపం

చైనాలో మరోసారి కొవిడ్ కలకలం రేగింది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఒక్కసారిగా కొత్త కేసులు పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

China Corona Cases : ఒక్కరోజే 33వేల కరోనా కేసులు.. చైనాలో మళ్లీ కొవిడ్ విశ్వరూపం

China Corona Cases : కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో మరోసారి కొవిడ్ కలకలం రేగింది. చైనాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఒక్కసారిగా కొత్త కేసులు పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కరోనా వైరస్‌ మరోసారి చైనాను వణికిస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం చైనాను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా గురువారం ఒక్కరోజే 32వేల 943 కేసులు నమోదయ్యాయి. వీటిలో 29వేల 840 కేసులు అసింప్టొమేటిక్, 3వేల 103 కేసులు సింప్టొమేటిక్ అని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినా, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా.. రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. మళ్లీ ప్రబలుతున్న కరోనా మహమ్మారి.. చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసింది.

రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. మహమ్మారి కట్టడి.. చైనాలో మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా సోకిన నగరాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఆఫీసులు, రెస్టారెంట్లను అధికారులు మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా నగరంలో కేసులు వచ్చినా ఆ నగరం మొత్తాన్ని అధికారులు షట్ డౌన్ చేస్తున్నారు. సామూహిక కరోనా పరీక్షలు, ప్రయాణ పరిమితులు, లాక్‌డౌన్లతో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు యత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కఠినమైన నిర్బంధం విధిస్తున్నారు.