Russia : రష్యాలో రోజుకు వెయ్యి కరోనా మరణాలు.. పుతిన్ కీలక నిర్ణయం

రష్యాలో మాత్రం చైనా, ఇండియా, అమెరికాల మాదిరిగా... వ్యాక్సినేషన్ కు స్పందన రావడం లేదు................................

Russia : రష్యాలో రోజుకు వెయ్యి కరోనా మరణాలు.. పుతిన్ కీలక నిర్ణయం

Russia Putin Covid

Russia : రష్యాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో వెయ్యి మందికి పైగా కరోనా బాధితులు రష్యాలో చనిపోయారు. రష్యాలో కరోనా మహమ్మారి కాలం మొదలైనప్పటినుంచి.. ఒకరోజులో వెయ్యిమంది చనిపోవడం ఇదే మొదటిసారి కావడంతో.. అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Read This : Covid-19 : కరోనా కారణంగా రెండేళ్లు తగ్గిన జీవిత కాలం

కరోనా వచ్చిన తొలినాళ్లలోనే వేగంగా వ్యాక్సిన్ తీసుకొచ్చిన దేశాల్లో రష్యా ఒకటి. అక్కడి సర్కారు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను తొందర్లోనే తీసుకొచ్చి దేశ ప్రజలకు అందించింది. ప్రస్తుతం భారత్ సహా.. ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. పలు దేశాలు స్పుత్నిక్ వీపై నమ్మకంతో ఉన్నాయి. ఐతే… రష్యాలో మాత్రం ప్రజలు స్పుత్నిక్ వీని వేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇండియాలో ఇప్పటికే వంద కోట్ల మందికి మొదటి డోస్ కంప్లీట్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కానీ.. రష్యాలో మాత్రం చైనా, ఇండియా, అమెరికాల మాదిరిగా… వ్యాక్సినేషన్ కు స్పందన రావడం లేదు. ఈ వేవ్ లో మరణాలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో.. పుతిన్ సర్కారు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Read This : 100 Crore Covid Doses : భారత్ 100 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేసిన ఘనత

అక్టోబర్ 30 నుంచి.. నవంబర్ 7 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆఫీస్ లకు సెలవులు ప్రకటించింది రష్యా ప్రభుత్వం. ఎవరూ ఆఫీస్ లకు రావొద్దని సూచించింది. అందరికీ పెయిడ్ హాలీడేస్ ప్రకటించింది. ఆఫీస్ లకు రాకపోయినా.. అందరికీ జీతాలు అందుతాయని.. దీనిని అందరూ విధిగా పాటించాలని రష్యా ప్రభుత్వం శాఖలకు, సంస్థలకు సూచించింది. దీనిని నేషనల్ కర్ఫ్యూగా చెబుతున్నారు. ఈ వారం, పది రోజుల్లో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ లో పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది.