Covid-19 : కరోనా కారణంగా రెండేళ్లు తగ్గిన జీవిత కాలం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత దేశ ప్రజల ఆయుర్ధాయం సగటున రెండేళ్లు తగ్గిందని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ అనె సంస్ధ(ఐఐపీఎస్) వెల్లడిం

Covid 19
Covid-19 : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత దేశ ప్రజల ఆయుర్ధాయం సగటున రెండేళ్లు తగ్గిందని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ అనె సంస్ధ(ఐఐపీఎస్) వెల్లడించింది. దేశ ప్రజల జీవితకాలం తగ్గినట్లు సంస్ధ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. కరోనా మహమ్మారి వల్ల ఆడ, మగవారిలో ఆయుష్షు తగ్గినట్లు తేల్చారు. సంస్ధ నిర్వహించిన సర్వే వివరాలను బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు.
ఐఐపీఎస్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ నివేదికను పొందుపరిచారు. 2019లో పురుషుల్లో జీవితకాలం 69.2 ఏళ్లు కాగా, ఆడవారిలో 72 ఏళ్లుగా ఉంది. అయితే ఆయుష్షు రెండేళ్లు తగ్గడం వల్ల.. పురుషుల్లో 67.5 ఏళ్లు, మహిళల్లో 69.8 ఏళ్లకు సగటు ఆయుష్షు చేరినట్లు ఆ నివేదికలో తెలిపారు.
Also Read : Government Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ పిల్లకు జన్మనిచ్చిన అడిషనల్ కలెక్టర్
2020లో కోవిడ్ వల్ల 35 నుంచి 79 ఏళ్ల వయసున్న వారిలో ఎక్కువ శాతం మరణాలు సంభవించినట్లు తేల్చారు. దీని వల్లే జీవితకాలం తగ్గినట్లు స్పష్టమవుతోందని యాదవ్ అన్నారు. అంటు వ్యాధులు ప్రబలినప్పుడల్లా ప్రజల ఆయుర్ధాయం క్షీణిస్తోందని ఐఐపిఎస్ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ జేమ్స్ అన్నారు. ఆఫ్రికన్ దేశాలలో హెచ్ఐవీ ఎయిడ్స్ మహమ్మారి వ్యాపించిన సమయంలో కూడా అక్కడి ప్రజల్లో ఆయుర్దాయం తగ్గిందని చెప్పారు.