Oral Covid Drug : త్వరలో నోటి ద్వారా కొవిడ్ మెడిసిన్..క్లినికల్ ట్రయల్స్ షురూ..
త్వరలో నోటి ద్వారా కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తోంది. దీనికి కోసం ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.

Trial Of New Oral Drug Against Covid 19 Begins In South Africa
Oral Covid Drug : ప్రపంచాన్ని రెండేళ్లుగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లుగా మారి శాస్త్రవేత్తలకు సవాలు విసురుతోంది.ఇప్పటికే కరోనాను నియంత్రించటానికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన ఈ వ్యాక్సిన్లు సూది మందు ద్వారా అంటే టీకాలా వేస్తున్నారు. కానీ త్వరలోనే కరోనాకు నోటి ద్వారా వేసే మెడిసిన్ అందుబాటులోకి తీసుకురావటానికి పరిశోధనలు ముమ్మరం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అమెరికా- ఇజ్రాయెలుకు చెందిన ఒరా వ్యాక్స్ అనే సంస్థ ‘నోటి ద్వారా వేసే కోవిడ్ మెడిసిన్’తయారు చేస్తోంది.
అమెరికా-ఇజ్రాయెల్‌కు చెందిన ఔషధ కంపెనీ ఒరామెడ్‌కు అనుబంధ సంస్థ ఒరావ్యాక్స్ రూపొందించిన ఈ మెడిసిన్ పై దక్షిణాఫ్రికాలో మొదటి విడత క్లినికల్ ప్రయోగాలు కూడా మొదలయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ అనేది సౌతాఫ్రికాలోనే వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి శాస్త్రవేత్తలు దీనిపై పలు కోణాల్లో పరిశోధనల్ని ముమ్మరం చేశారు. వ్యాక్సినేషన్ల ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడానికి దక్షిణాఫ్రికా తీవ్రంగా కృషి చేస్తోంది.
Read more : Omicron : ఒమిక్రాన్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమం, టిమ్స్ నుంచి గాంధీకి తరలింపు
కానీ యూరప్ లోని పలు దేశాల్లో వ్యాక్సిన్లు వేయించుకోవటానికి ప్రజలు ఇష్టపడటంలేదు.ఆస్ట్రియా, యూకే,ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో పాటు సౌతాఫ్రికాలో కూడా చాలామంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడటంలేదు. వ్యాక్సిన్ వేయించుకోవటానికి నిరాకరించేవారిని జైల్లో వేయాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే ఆదేశాలు జారీ చేసినా ఈనాటికి అక్కడి ప్రజలు టీకా వేయించుకోవటానికి ఆసక్తి చూపించట్లేదు అంటే వ్యాక్సిన్ పై ఎంతగా వ్యతిరేకత ఉంది ఊహించుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఇక టీకా ద్వారా సూది మందు ద్వారా వేయించుకోనక్కరలేదు. నోటి ద్వారానే కోవిడ్ మెడిసిన్ వేయించుకోవచ్చు దీన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామంటోంది ఒరా వ్యాక్స్ సంస్థ. దీనివల్ల వ్యాక్సినేషన్ సులువవుతుందని ఒరామెడ్ సీఈవో నాడవ్ కిడ్రోన్ తెలిపారు. ఇది వైరస్-లైక్ పార్టికిల్స్ (VLP) టీకా అని ..గతంలో కొవిడ్ టీకా పొందనివారిని…కరోనాకు గురికానివారిని క్లినికల్ ప్రయోగాల కోసం సెలెక్ట్ చేసుకున్నామని తెలిపారు. నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కూడా రెండు డోసుల్లో దీన్ని ఇస్తామని..ఈ రెండు డోసుల మధ్యా..3 వారాల విరామం ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్‌లోని మూడు రకాల ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసామని వెల్లడించారు. ఉత్పరివర్తనకు పెద్దగా లోనుకాని ఒక ప్రొటీన్ ఇందులో ఉందని వెల్లడించారు.
Read more : Hamsanandini : బ్రెస్ట్ క్యాన్సర్‌తో హంసానందిని.. ఇప్పటికే తొమ్మిది సార్లు కీమోథెరపీ