Omicron : ఒమిక్రాన్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమం, టిమ్స్ నుంచి గాంధీకి తరలింపు

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.

Omicron : ఒమిక్రాన్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమం, టిమ్స్ నుంచి గాంధీకి తరలింపు

Omicron (3)

Omicron : దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఈ వేరియంట్ ఇప్పటికే తొంబైకి పైగా ప్రపంచ దేశాలకు పాకింది. చిన్న దేశాల్లో కూడా కరోనా ఈ వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి. బ్రిటన్‌లో ఒమిక్రాన్ తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడే తోలి ఒమిక్రాన్ మరణం నమోదైంది.

చదవండి : Omicron Variant : వామ్మో ఒమిక్రాన్.. ఒక్కరోజే 10వేల కేసులు నమోదు

ఇక తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిని టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 20 మంది ఒమిక్రాన్ బాధితులను గుర్తించారు అధికారులు. వీరిని కలిసిన వారికి పరీక్షలు చేస్తున్నారు అధికారులు. టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీకి తరలించారు వైద్యులు. ఇక మిగతా వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

చదవండి : Omicron In India : 151కి పెరిగిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య..ఢిల్లీలో సీన్ రివర్స్

ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటివరకు 155 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 54 కేసులు, ఢిల్లీలో 22 కేసులు, తెలంగాణలో 20 కేసులు నమోదయ్యాయి. ఇక మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే రాజస్థాన్ 17,కర్ణాటక 14, కేరళ 11, గుజరాత్ 11, ఉత్తరప్రదేశ్ 2, చండిఘడ్ 1,తమిళనాడు 1, పశ్చిమ బెంగాల్ 1, ఏపీలో 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ప్రపంచదేశాలను హెచ్చరించింది WHO.

చదవండి : Omicron Symptoms : ఒమిక్రాన్ లక్షణాలు ఇవే … యూకే తాజా అధ్యయనంలో వెల్లడి

ముందుజాగ్రత్తగా ఆసుపత్రుల్లో బెడ్లు పెంచుకోవాలని సూచించింది. వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలనీ తెలిపారు. చిన్న దేశాలకు సాయం చేయడంతో పెద్ద దేశాలు ముందుకు రావాలని, అవసరైన ఏర్పాట్లు చేయాలని తెలిపింది.