Omicron Symptoms : ఒమిక్రాన్ లక్షణాలు ఇవే … యూకే తాజా అధ్యయనంలో వెల్లడి

ఒమిక్రాన్ సోకిన వారిలో ప్రధానంగా ముక్కు కారడం.. తలనొప్పి.. వాంతి అవుతున్నట్లు కడుపులో  తిప్పేయటం... తల తిరిగినట్లుగా  అనిపించటం.. గొంతులో   గరగర లాంటి లక్షణాలు కనిపిస్తాయని తాజా అధ

Omicron Symptoms : ఒమిక్రాన్ లక్షణాలు ఇవే … యూకే తాజా అధ్యయనంలో వెల్లడి

Omicron Symptoms

Omicron Symptoms :  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పడు అందరినీ వణికిస్తున్న ఒమిక్రాన్ లక్షణాలపై   యూకే లో తాజా గా సర్వే చేశారు. ఒమిక్రాన్ వేరియంట్   సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయనే అంశంపై కోవిడ్-19   ట్రాకింగ్ స్టడీ పేరుతో చేసిన సర్వే నివేదికను డైలీ మెయిల్ పేపరులో వెల్లడించారు.

ఈ  నివేదిక ప్రకారం ఒమిక్రాన్ సోకిన వారిలో ప్రధానంగా ముక్కు కారడం.. తలనొప్పి.. వాంతి అవుతున్నట్లు కడుపులో  తిప్పేయటం… తల తిరిగినట్లుగా  అనిపించటం.. గొంతులో   గరగర లాంటి లక్షణాలు కనిపిస్తాయని తాజా అధ్యయనం లో తెలిపారు.  ప్రధాన లక్షణాలు అన్నీ సాధారణ   జలుబు లక్షణాలనే   పోలి ఉంటాయని నివేదిక తెలిపింది.  ఒమిక్రాన్ బారిన పడిన  వేలాది మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదిక రూపోందించినట్లు  అధ్యయనకారులు వెల్లడించారు.

Also Read : Liquor Rates Decrease : వైన్ షాపుకు పూజలు చేసిన మందు బాబులు

అయితే, ఇత‌ర క‌రోనా వేరియంట్ల మాదిరిగా   ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ఆగకుండా  వచ్చే ద‌గ్గు, తీవ్ర జ్వ‌రం, రుచి,వాస‌నలు కోల్పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలేవి క‌నిపించ‌లేద‌ని అధ్య‌య‌న‌కారులు  తెలిపారు. ఇత‌ర వేరియంట్‌ల‌తో   పోల్చుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ ల‌క్ష‌ణాల తీవ్ర‌త త‌క్కువ‌గా ఉన్నప్పటికీ… దాన్ని త‌క్కువగా  అంచ‌నా వేయ‌వద్దని సూచిస్తున్నారు.  ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేప‌థ్యంలో క్రిస్‌మ‌స్, నూతన సంవత్సర వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌లు భౌతిక దూరం పాటించటం, శానిటైజ్ చేసుకోవటం,వ్యాక్సిన్ వేయించుకుని ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.