ఆవు పిడక ఒక్కోటి రూ.214 మాత్రమే

ఆవు పేడను గోడలకు కొట్టి పిడకలుగా చేయడం పల్లె వాతావరణంలోనే చూస్తూ ఉంటాం. కానీ, ఈ పిడకలు కూడా కవర్లలో ప్యాక్..

ఆవు పిడక ఒక్కోటి రూ.214 మాత్రమే

ఆవు పేడను గోడలకు కొట్టి పిడకలుగా చేయడం పల్లె వాతావరణంలోనే చూస్తూ ఉంటాం. కానీ, ఈ పిడకలు కూడా కవర్లలో ప్యాక్..

మనకు మామూలుగా పేడను ఎరువుగా, ఇందనంగా, అంటురోగాలకు దూరంగా ఉంచేదిగానే తెలుసు. వైద్యపరంగానూ నిర్ధారణకావడంతో చర్మవ్యాధులకు, రక్త హీనతకు వాడుతూ ఉన్నారు. ఆవు పేడను గోడలకు కొట్టి పిడకలుగా చేయడం పల్లె వాతావరణంలోనే చూస్తూ ఉంటాం. కానీ, ఈ పిడకలు కూడా కవర్లలో ప్యాక్ అయిపోయి సిటీల్లోకి కాదు, విదేశాలకే ఎగుమతి అయిపోతున్నాయి.

పైగా వీటి ధర మూడు డాలర్లు. పైగా ఈ పిడకల పేరు కేక్ అని గుండ్రని షేప్‌తో అమ్మేస్తున్నారు. వీటిని షాపుల్లోనే కాదు. ఫ్లిప్ కార్టు, అమెజాన్ లాంటి ఈ కామర్స్ సైట్లు అమ్మకానికి ఉంచుతున్నాయి. న్యూజెర్సీలో ఇవి భారీ ట్రెండింగ్ గా మారిపోయాయి. అసలే కార్తీక మాసం విదేశాల్లో ఉన్నా సంప్రదాయం పాటించేవారు పిడక రేటు రూ.214లు పెట్టి కొనుక్కుంటున్నారు. 

ఈ పిడకల ఫొటోను ఓ నెటిజన్ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఆవు పేడ అని నమ్మి తీసుకుంటున్న వారు ఇవి భారత ఆవుల నుంచి తీసుకొచ్చినదా.. లేదా అక్కడే ఉండే యాంకీ ఆవులదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడివి అయినా పరవాలేదు కరెక్ట్ టైంకి మార్కెట్లోకి వచ్చాయంటూ  వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.