David Bennett : పంది గుండె అమర్చిన మొదటి వ్యక్తి మృతి!

David Bennett : పంది గుండెను అమర్చిన మొదటి వ్యక్తి మృతిచెందాడు. గత జనవరి 7న వైద్యులు డేవిడ్ బెన్నెట్ (57) అనే వ్యక్తికి పంది గుండెను అమర్చారు.

David Bennett : పంది గుండె అమర్చిన మొదటి వ్యక్తి మృతి!

David Bennett First Person To Receive Gene Edited Pig Heart Dies Two Months After Historic Transplant (1)

David Bennett : పంది గుండెను అమర్చిన మొదటి వ్యక్తి మృతిచెందాడు. గత జనవరి 7న వైద్యులు డేవిడ్ బెన్నెట్ (57) అనే వ్యక్తికి పంది గుండెను అమర్చారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ మెడికల్‌ సెంటర్‌ నిపుణులు ఈ ఘనత సాధించారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న బెన్నెట్ ఆరోగ్యం క్షీణించడంతో రెండు నెలల తర్వాత అతడు మరణించినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ ప్రకారం.. బెన్నెట్ మరణానికి కారణం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. వైద్యశాస్త్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చి వైద్యులు విజయవంతమయ్యారు. అతన్ని బతికించేందుకు చివరి ప్రయత్నంగా ప్రయోగాత్మకంగా హార్ట్ సర్జరీ చేశారు. ఈ సర్జరీ జరిగిన రెండు నెలల తర్వాత బెన్నెట్ ఆరోగ్యం క్షీణించి మృతిచెందాడు.

ఆపరేషన్ ముగిసిన మూడు రోజులు వరకు అతడు ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. అయితే రెండు నెలల తర్వాత అతడి ఆరోగ్యంలో మార్పులు కనిపించాయి. కోలుకున్నట్టే కోలుకుని అనారోగ్యం తిరగబడింది. బహుషా అతడికి అమర్చిన పంది గుండె శస్ర్తచికిత్స ఫెయిల్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా మొదటిసారిగా మనిషికి పంది గుండెను అమర్చిన వైద్యులు జన్యుపరంగా మార్పుచేసిన జంతు అవయవాన్ని డేవిడ్ బెన్నెట్‌కు శరీరంలో అమర్చారు. ఆస్పత్రి ప్రతినిధి డెబోరా కోట్జ్ మాట్లాడుతూ.. అతని మరణానికి గల కారణాలను సమీక్షించిన అనంతరం ఫలితాలను త్వరలో వెల్లడించనున్నట్టు తెలిపారు. పరిశోధకులు కూడా దీనిపై లోతుగా పరిశోధించేందుకు ప్లాన్ చేస్తున్నారని డెబోరా చెప్పారు.

David Bennett First Person To Receive Gene Edited Pig Heart Dies Two Months After Historic Transplant

David Bennett First Person To Receive Gene Edited Pig Heart Dies Two Months After Historic Transplant

బెన్నెట్‌ మృతి పట్ల చింతిస్తున్నామని, మరణంతో చివరి వరకు పోరాడిన ధైర్యవంతుడని, మృతుడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని బెన్నెట్ గుండె మార్పిడి చేసిన సర్జన్ డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనిషికి పంది గుండెను అమర్చి వైద్యులు విజయవంతమయ్యారు. ఈ శస్ర్తచికిత్స విజయవంతంగా పూర్తి అయినప్పటికీ ఎంతవరకు ఫలిస్తుందో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందేనని ముందే వైద్యులు వెల్లడించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడేం చెప్పలేమన్నారు. ప్రాణాంతక పరిస్థితుల్లో జంతువుల అవయవాలను మనుషులకు అమర్చేందుకు దశాబ్దాలుగా అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వైద్యులు అభిప్రాయపడ్డారు. అందులో ఇదొ ప్రయత్నంగా పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఆ మొదటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.

Read Also : Pig Heart: మనిషికి పంది గుండె.. ఆపరేషన్ సక్సెస్!