చెవిలో బొద్దింక.. ప్రాణాలతో బయటకు తీసిన డాక్టర్

చెవిలో బొద్దింక.. ప్రాణాలతో బయటకు తీసిన డాక్టర్

ఇండియా కల్చర్ తో పోలిస్తే ఎక్కువ జంతుజాలాల్ని తినేసేది చైనా వాళ్లే. కడుపులో ఏ పురుగైనా అరిగించుకోలగరు కానీ, చెవిలో దూరిన పురుగు సంగతేంటి మరి. ఇటీవల చెన్‌ అనే ఓ చైనా యువతి చెవిలో మాత్రం ఓ బొద్దింక దూరి ఏకంగా గూడు కట్టేసుకుంది. లోపలికి ఎప్పుడు చొరబడిందో ఏమోగానీ, రోజూ వింత శ‌బ్దాల‌తో యువతి చెవులో వింత శబ్ధాలు వినిపించేవి.

అనుక్షణం ఆమెను హడలు పుట్టించిన బొద్దింక దాని చర్యలతో ఆమెకు అప్పుడప్పుడు నొప్పిగా అనిపించేది. దాంతో చెవిలో దుమ్మూధూళీ ఉండొచ్చని ఆమె ఇయ‌ర్ బడ్స్‌తో శుభ్రం చేసేది. చెన్‌కు ఉపశమనం లభించకపోగా నొప్పి మరింత ఎక్కువైంది. చివరకు డాక్టర్‌ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. చెన్‌ చెవిలో బొద్దింక ఉన్నట్టు తెలిసింది. ఇంకా ఆ బొద్దింక బతికే ఉందని తెలియడంతో డాక్టర్లు ఆశ్చర్యంతో పాటు ఆందోళన మొదలైంది.

ఒటోస్కోప్ విధానం ద్వారా ఎట్టకేలకు యువతి చెవిలో నుంచి బొద్దింక‌ను బ‌య‌ట‌కు తీయగలిగారు. బొద్దింక ఇంకొన్ని రోజులు చెవిలోనే ఉండి ఉంటే.. కర్ణభేరీకి రంధ్రం చేసి త‌ల‌లోకి ప్రవేశించేదని ముందుగా కనిపెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. చెన్‌ నిద్రించే సమయంలో బొద్దింక చెవిలో దూరి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.