Bangkok : నడి రోడ్డుపై కుక్క కోసం బస్సును ఆపిన డ్రైవర్

నడి రోడ్డుపై ఓ కుక్క చిక్కుకపోయింది. అదే సమయంలో..ఓ బస్సు వస్తోంది. అటూ..ఇటూ తిరుగుతున్న కుక్కను డ్రైవర్ Tuen Prathumthong గమనించాడు.

Bangkok : నడి రోడ్డుపై కుక్క కోసం బస్సును ఆపిన డ్రైవర్

Driver stops

Updated On : April 1, 2021 / 3:25 PM IST

Driver stops : జంతువులు అంటే కొంతమందికి ప్రేమ. అవి బాధతో అల్లాడుతుంటే చూడలేదు. రోడ్లపై అటూ..ఇటూ తిరుగుతున్న వీటికి ఎలాంటి ప్రమాదం రాకుండా చర్యలు తీసుకుంటుంటారు. అలాగే..ఓ బస్సు డ్రైవర్ చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన బ్యాంకాక్ లో చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఓ కుక్క చిక్కుకపోయింది. అదే సమయంలో..ఓ బస్సు వస్తోంది. అటూ..ఇటూ తిరుగుతున్న కుక్కను డ్రైవర్ Tuen Prathumthong గమనించాడు. దానికి ఏలాంటి ప్రమాదం జరుగకూడదనే ఉద్దేశ్యంతో నడి రోడ్డుపైనే బస్సును ఆపివేశాడు.

దీంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు అలాగే నిలిచిపోయాయి. బస్సు దగ్గరకు వచ్చిన కుక్క…అమాంతం..లోపలికి వచ్చి ఓ సీటులో కూర్చొంది. కుక్కను ఎక్కించుకోవడం పట్ల ప్రయాణీకులను అభ్యంతరాలు వ్యక్తమౌతాయా ? అని కండక్టర్ భావించాడు. లోపలకి రావాలని కుక్కకు సూచించడం జరిగిందని కండక్టర్ వెల్లడించాడు. అనంతరం కుక్కను డిపోకి తీసుకెళ్లి…ఆహారం, మంచినీళ్లు అందించాడు. అయితే..Cookie అనే పేరు గల కుక్క మూడు రోజుల నుంచి తప్పిపోయిందని Metro.co.uk వెల్లడించింది.

ఈ విషయం తెలుసుకున్న ఆ కుక్క యజమానురాలు అక్కడకు చేరుకున్నాడు. తమ ఇంచి నుంచి Cookie తప్పిపోయిందని, అప్పటి నుంచి దీని కోసం వెతుకుతున్నామన్నారు. కుక్కను సేఫ్ గా తీసుకొచ్చినందుకు రూ. 5 వేలు యజమాని ఇచ్చింది. కానీ..ఆ నగదును డ్రైవర్ తీసుకోకుండా…జంతు రెస్క్యూ గ్రూపులకు ఇచ్చారు.

Read More : మందుబాబులకు గుడ్ న్యూస్, బీర్ వెరీ చీప్