Dubai : ప్రపంచంలో తొలిసారిగా నీటిపై తేలియాడే మసీదు .. ప్రత్యేకతలేంటో తెలుసా..

ఆకాశాన్ని అంటే భవనాలకు పేరొందిన దేశం. అత్యద్భుత కట్టడానికి వేదికగా నిలువనుంది. ప్రపంచలోనే తొలసారిగా నీటిలో తేలియాడే మసీదును నిర్మించేందుకు సిద్ధమైంది.

Dubai : ప్రపంచంలో తొలిసారిగా నీటిపై తేలియాడే మసీదు .. ప్రత్యేకతలేంటో తెలుసా..

world first underwater mosque

Updated On : September 23, 2023 / 9:13 AM IST

world first underwater mosque :  దుబాయ్. భూతల స్వర్గం. ఆకాశాన్ని అంటే భవనాలకు పేరొందిన దేశం. ఏ భవనం కట్టినా అదో ప్రత్యేకతగా నిలవటం దుబాయ్ కే చెల్లింది. అటువంటి దుబాయ్ మరో అత్యద్భుత కట్టడానికి వేదికగా నిలువనుంది. దుబాయ్ తో ప్రపంచలోనే తొలసారిగా నీటిలో తేలియాడే మసీదును నిర్మించేందుకు సిద్ధమైంది.

ఆర్థిక సంపదలో దూసుకుపోతున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రపంచంలోనే తొలిసారిగా నీటిలో తేలియాడే మసీద్ నిర్మాణానికి ప్లాన్ వేస్తోంది. సుమారు 55 మిలియన్‌ ధీరమ్‌లు (సుమారు 124 కోట్ల రూపాయలు) వ్యయంతో నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు అంతస్థులుగా ఈ మసీదు నిర్మాణం ఉండనుంది. టూరిజాన్ని డెవలప్ చేస్తు చక్కటి ఆర్థిక సంపదను క్రియేట్ చేసుకుంటున్న యూఏఈ ఎంతోమంది పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తోంది. శ్రీమంతులు యూఏఈలో స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎన్నో అద్భుత కట్టడాలతో ప్రపంచ కుబేరుల్ని ఆకట్టుకునే యూఏఈ ఆధ్యాత్మిక టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు మొదటిసారిగా దుబాయ్‌ వాటర్‌ కెనాల్‌లో వచ్చే ఏడాది నీటిపై తేలియాడే మసీదును ప్రారంభించాలని నిర్ణయించింది.మూడు అంతస్థులుగా నిర్మించనున్న ఈ మసీదు మొదటి అంతస్థులో ప్రార్ధనా స్థలం, రెండో అంతస్థులో ఓ భారీ విస్తీర్ణయంలో హాలు, మూడో అంతస్తులో ఆస్లామిక్ ప్రదర్శన శాల ఉంటుంది.