Economic Crisis: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం.. ఫంక్షన్లలో ఒకటే వంట

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్.. ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నంలో భాగంగా కొత్త నియమాలను విధించింది. నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ నగరంలో రాత్రి 10 గంటల తర్వాత వివాహ కార్యక్రమాలను నిషేధించాలని నిర్ణయించింది.

Economic Crisis: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం.. ఫంక్షన్లలో ఒకటే వంట

Pakistan

Economic Crisis: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్.. ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నంలో భాగంగా కొత్త నియమాలను విధించింది. నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ నగరంలో రాత్రి 10 గంటల తర్వాత వివాహ కార్యక్రమాలను నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మీడియా తెలిపిన నివేదికలో భాగంగా తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది.

ఈ మేరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని పలు చర్యలు తీసుకుంది. జూన్ 8 నుండి అమలులోకి వచ్చేలా ఇస్లామాబాద్‌లో రాత్రి 10 గంటల తర్వాత వివాహ కార్యక్రమాలను నిషేధించనున్నట్లు జియో న్యూస్ నివేదించింది.

దేశంలో ప్రస్తుత విద్యుత్ సంక్షోభం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేసింది. ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, చివరి నాటికి విద్యుత్ లోడ్ క్రమంగా రోజుకు రెండు గంటలకు తగ్గించడానికి ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం సెలవును పునరుద్ధరించాలని ఫెడరల్ క్యాబినెట్‌ ఒత్తిడి చేసింది.

Read Also: పాకిస్తాన్ ప్రధానికి సౌదీలో ఘోర అవమానం: ‘దొంగ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు

ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ సూచనల మేరకు దేశ రాజధానిలో వివాహ కార్యక్రమాలపై ఆంక్షలు అమలవుతున్నాయని డైలీ టైమ్స్ వార్తాపత్రిక మూలాలను ఉటంకిస్తూ నివేదించింది.

నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఇస్లామాబాద్ పోలీసులు మరియు నగర పాలక సంస్థను ఆదేశించినట్లు వర్గాలు తెలిపాయి. ఉల్లంఘిస్తే ఇస్లామాబాద్ పరిపాలన కఠిన చర్యలు తీసుకుంటుందని ఆ వర్గాలు తెలిపాయి. అలా రాజధానిలో జరిగే పెళ్లి వేడుకల్లో కేవలం ఒక వంటకాన్ని మాత్రమే అనుమతించనున్నట్లు జియో న్యూస్ పేర్కొంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw