Pakistan PM: పాకిస్తాన్ ప్రధానికి సౌదీలో ఘోర అవమానం: ‘దొంగ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు

పాకిస్తాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు సౌదీ అరేబియాలో ఘోర అవమానం జరిగింది. 'దొంగ దొంగ' అంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా సౌదీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Pakistan PM: పాకిస్తాన్ ప్రధానికి సౌదీలో ఘోర అవమానం: ‘దొంగ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు

Chor

Pakistan PM: పాకిస్తాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు సౌదీ అరేబియాలో ఘోర అవమానం జరిగింది. ‘దొంగ దొంగ’ అంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా సౌదీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా గురువారం సౌదీ అరేబియాలో ముస్లింలు పవిత్రంగా భావించే మదీనాలోని ‘మస్జిద్-ఎ-నబవి’ మసీదును సందర్శించారు షరీఫ్. అయితే షరీఫ్ మసీదు ప్రాంతంలోకి చేరుకోగానే అక్కడ ఉన్న ముస్లింలు పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షెహబాజ్ షరీఫ్ ‘చోర్ చోర్ (దొంగ దొంగ)’ అంటూ పెద్ద సంఖ్యలో ముస్లింలు నినాదాలు చేశారు. ఈ దృశ్యాలను కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో చిత్రీకరించగా..వాటిని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు చేజిక్కించుకున్నారు.

Also read:India – China Visas: చైనానే మనకు వీసాలు ఇవ్వడంలేదు: భారత విదేశాంగశాఖ కార్యదర్శి

అనంతరం ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు కూడా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, పాకిస్తాన్ సమాచారశాఖ మంత్రి మరియం ఔరంగజైబ్ మరియు నేషనల్ అసెంబ్లీ సభ్యుడు షాజైన్ బుగ్తీతో కలిసి మూడు రోజుల పర్యటన నిమిత్తం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియాకు వెళ్లారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు జరిగిన అవమానంపై ఆదేశ సమాచారశాఖ మంత్రి ఔరంగజైబ్ స్పందిస్తూ..”ఇదంతా గత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వలనే జరిగింది. ఇటువంటి పవిత్ర ప్రదేశంలో నేను ఆయన పేరు కూడా పలకదలుచుకోలేదు. ఎందుకంటే పవిత్ర స్థలాన్ని రాజకీయం కోసం ఉపయోగించడం ఇష్టం లేదు. కానీ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పరువును దిగజార్చాడు” అని అన్నారు.

Also read:Russia-Ukraine War : రష్యా సైనికుల్ని అడ్డుకోవటానికి గ్రామాన్ని నీటితో ముంచేసిన యుక్రెయిన్ వాసులు

ఈవ్యాఖ్యలపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యాలయం స్పందిస్తూ..అమెరికా పన్నిన కుట్ర ద్వారా అధికారంలోకి వచ్చిన షరీఫ్ దొంగల ముఠాకు మదీనాలో దొంగ ముద్రతో స్వాగతం లభించింది అంటూ ఎద్దేవా చేశారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మదీనా ‘మస్జిద్-ఎ-నబవి’ మసీదు వద్ద రాజకీయలు బయటపడడంపై ముస్లిం దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Also read:Delhi : ఢిల్లీ పేరు మార్చి ‘ఇంద్రప్రస్థ’ అని పెట్టాలంటూ డిమాండ్