యూకేలో మరో కొత్త వేరియంట్.. వెరీ డేంజరస్.. భారీగా మరణాలు పెరగొచ్చు : ఇదిగో సాక్ష్యం!

యూకేలో మరో కొత్త వేరియంట్.. వెరీ డేంజరస్.. భారీగా మరణాలు పెరగొచ్చు : ఇదిగో సాక్ష్యం!

SARS-CoV-2 UK Variant More Deadly Than Previous One : చైనాలోని వుహాన్‌లో పుట్టిన మొదట్లో కరోనావైరస్ SARS-CoV-2 కంటే.. ఇప్పుడు యూకేలో విజృంభిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ అత్యంత ప్రాణాంతకమంట.. అత్యధిక స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యే ముప్పు పొంచి ఉందని అంటోంది బ్రిటన్ ప్రభుత్వం. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో ప్రకటించారు.

యూకే వేరియంట్ SARS-CoV-2.. గత కరోనా వేరియంట్ల కంటే వెరీ డేంజరస్ అని, వేగంగా వ్యాపించడంతో పాటు మరణాల రేటు కూడా భారీగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిష్ విట్టీ, గవర్నమెంట్ సైంటిఫిక్ అడ్వైజర్ సర్ పాట్రిక్ వాల్లాన్స్ కూడా ఇదే షాకింగ్ విషయాన్ని ప్రస్తావించారు.

ఈ కొత్త వేరియంట్ ఎలా విజృంభిస్తోందో తెలియడం లేదని, అత్యంత ప్రాణాంతకమని అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ మాత్రం ఈ వేరియంట్ పై సమర్థవంతంగా పోరాడగలదని జాన్సన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.