elon musk: అపర కుబేరుడు.. సొంతిల్లు కూడా లేదట!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్. ఇంత సంపద కలిగిన ఎలన్ మస్క్‌కు ప్రస్తుతం సొంతిల్లు కూడా లేదట.

Elon Musk
elon musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్. స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత అయిన మస్క్ ట్విట్టర్‌లో కూడా వాటా కలిగి ఉన్నాడు. మొత్తం అతడి సంపద దాదాపు 269 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇంత సంపద కలిగిన ఎలన్ మస్క్‌కు ప్రస్తుతం సొంతిల్లు కూడా లేదట. ఇటీవల ‘టెడ్స్’కు చెందిన క్రిస్ ఆండర్సన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ ఈ విషయాలు వెల్లడించాడు.
Russia-Elon Musk: ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఉపగ్రహాలపై ‘అంతరిక్ష యుద్ధం’ ప్రకటించిన రష్యా
తనకు సొంతిల్లు లేదని, ఒక ఫ్రెండ్ ఇంట్లోని బెడ్‌రూమ్‌లో పడుకుంటున్నట్లు చెప్పాడు. ‘‘నాకు సొంత చోటంటూ ఏదీ లేదు. ఎప్పుడూ స్నేహితుల ఇళ్లల్లోనే ఉంటాను. సొంత షిప్పు కూడా లేదు. ఎందుకంటే నేను ఎలాంటి యాత్రలకు వెళ్లను. నా కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోలేను. కాకపోతే, విమానం ఒక్కటి దీనికి మినహాయింపు.
Elon Musk Offer : ట్విట్టర్‌ను కొనేస్తాను.. ఎలాన్ మస్క్ బంపరాఫర్..!
ఎందుకంటే విమానాన్ని వాడకపోతే ఎక్కువ గంటలు పనిచేసే అవకాశం దొరకదు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎలన్ మస్క్ ఒంటరిగానే ఉంటున్నారు. రెండేళ్ల క్రితం నుంచి ఎలన్ మస్క్ తనకున్న ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆయనకు సొంతిల్లు లేదు.