Elon Musk: షర్ట్‌లెస్ ఫొటోపై రెస్పాన్స్ తనకు మోటివేషన్ అంటోన్న బిజినెస్ దిగ్గజం

టెస్లా సీఈఓ గురించి ఏ విషయం తెలిసినా వైరల్ అయిపోతుంది. అలాంటిది మరి ఎలన్ మస్క్ క్రేజ్. ట్విట్టర్ కొనేస్తానంటూ హడావుడి చేసి.. తాను అడిగిన డేటా ఇవ్వలేదంటూ తూచ్.. నేను తప్పుకుంటున్నా అని రూట్ మార్చేశాడు. దీనిపై ట్విట్టర్ కౌంటర్ వేస్తూ న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైంది.

Elon Musk: షర్ట్‌లెస్ ఫొటోపై రెస్పాన్స్ తనకు మోటివేషన్ అంటోన్న బిజినెస్ దిగ్గజం

Elon Musk

 

 

Elon Musk: టెస్లా సీఈఓ గురించి ఏ విషయం తెలిసినా వైరల్ అయిపోతుంది. అలాంటిది మరి ఎలన్ మస్క్ క్రేజ్. ట్విట్టర్ కొనేస్తానంటూ హడావుడి చేసి.. తాను అడిగిన డేటా ఇవ్వలేదంటూ తూచ్.. నేను తప్పుకుంటున్నా అని రూట్ మార్చేశాడు. దీనిపై ట్విట్టర్ కౌంటర్ వేస్తూ న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఇలాంటి మూమెంట్‌లో వేకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

దాంతో పాటు ఎప్పుడూ కనిపించని గెటప్‌లో షర్ట్ లేకుండా ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. నెటిజన్ల కామెంట్లతో షర్ట్‌లెస్ ఇష్యూని అతనిపై వచ్చిన ట్రోలింగ్స్‌ను చాలా పాజిటివ్ గా తీసుకున్నాడు.

“వర్కౌట్ చేయడానికి ఇది చాలా మోటివేషన్‌గా ఉంది. మంచిగా తిని సంవత్సరానికి ఒకసారి ఇలా పబ్లిక్ గా షర్ట్ లేకుండా కనిపిస్తా.. హ్హాహ్హా..” అంటూ కామెంట్ చేశాడు.

Read Also : ఎలన్ మస్క్‌పై ట్విటర్‌ దావా..ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

గ్రీస్‌లోని మైకోనోస్‌లో ఎంజాయ్ చేస్తూ… బ్లాక్ స్మిమ్ డ్రస్ లో ఉన్న మస్క్ సముద్రంలోకి దూకుతూ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఏవియేటర్ సన్ గ్లాసెస్ ధరించి, బోట్ చుట్టూ తిరుగుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇందులో భాగంగానే గ్రీస్‌లోని మైకోనోస్‌లో షర్ట్ లేకుండా తిరిగాడు.