Anand Mahindra : ఎలన్ మస్క్‌పై ట్విటర్‌ దావా..ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

ట్విటర్‌ను సొంతం చేసుకునేందుకు మస్క్‌ గతంలో 44 బిలియన్‌ డాలర్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్‌ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్‌ ముందుకు వెళ్లొదని గత కొంత కాలంగా చెబుతూ వచ్చిన ఆయన.. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

Anand Mahindra : ఎలన్ మస్క్‌పై ట్విటర్‌ దావా..ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

Anand Mahindra

Anand Mahindra : అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి అనూహ్యంగా తప్పుకోవడం కొత్త వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసేలా ట్విటర్‌.. మస్క్‌పై దావా వేసింది. ఈ పరిణామాలపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. మస్క్‌పై ట్విటర్‌ దావా వేయడం వృథా ప్రయాసే అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎలన్ మస్క్‌పై ట్విటర్‌ దావా వేసినట్లు వచ్చిన ఓ మీడియా కథనానికి స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. సమయం, శక్తి, డబ్బు.. అన్నీ వృథానే అన్నారు. వార్తల ప్రసారానికి, అందర్నీ కలిపేందుకు ట్విటర్‌ ఒక ఆవశ్యక వేదికని… దీన్ని ఓ పాక్షిక సామాజిక సంస్థలా, లాభాల కోసం ఆశించే ప్రైవేటు కంపెనీలా నడపాలనుకుంటున్నారా? లేక…ట్రస్టీల్లా బాధ్యాతాయుతమైన డైరెక్టర్లతో బలమైన శక్తిగా నడపాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.

Viral Video: మెరుపుల బండి.. ట్విటర్‌లో ఆసక్తికర వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా

ట్విటర్‌ను సొంతం చేసుకునేందుకు మస్క్‌ గతంలో 44 బిలియన్‌ డాలర్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్‌ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్‌ ముందుకు వెళ్లొదని గత కొంత కాలంగా చెబుతూ వచ్చిన ఆయన.. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

దీంతో మస్క్‌పై ట్విటర్‌ కోర్టును ఆశ్రయించింది. ఒప్పందంలో అంగీకరించినట్లుగా ఒక్కో షేరును 54.20 డాలర్ల వద్ద కొనుగోలు చేసేలా ఆదేశించాలని కోరుతూ డెలావర్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. షరతులకు లోబడి ఒప్పందాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.