Elon Musk: సెర్గీ బ్రిన్ భార్యతో ఎఫైర్ రూమర్లకు ఎలన్ మస్క్ ఘాటు రిప్లై

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్.. ఒక పార్టీలో గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్‌తో కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశారు. మస్క్‌తో బ్రిన్ భార్యకు ఎఫైర్ ఉందని చేస్తున్న కామెంట్లకు ఘాటు రిప్లై ఇచ్చేందుకు ఇలా చేసినట్లు తెలుస్తుంది. పైగా ఈ ఫొటో పెట్టి ఇది రెండు గంటల ముందే తీసుకున్న ఫొటో అని కామెంట్ చేశారు.

Elon Musk: సెర్గీ బ్రిన్ భార్యతో ఎఫైర్ రూమర్లకు ఎలన్ మస్క్ ఘాటు రిప్లై

Elon Musk

Elon Musk: టెస్లా సీఈఓ ఎలన్ మస్క్.. ఒక పార్టీలో గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్‌తో కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశారు. మస్క్‌తో బ్రిన్ భార్యకు ఎఫైర్ ఉందని చేస్తున్న కామెంట్లకు ఘాటు రిప్లై ఇచ్చేందుకు ఇలా చేసినట్లు తెలుస్తుంది. పైగా ఈ ఫొటో పెట్టి ఇది రెండు గంటల ముందే తీసుకున్న ఫొటో అని కామెంట్ చేశారు. బ్రిన్‌.. అతని భార్యకు విడాకులు ఇవ్వడంలో తన పాత్రేమీ లేదని వెల్లడించారు.

అలా కామెంట్లు వస్తున్న వాటిలో ఎటువంటి వాస్తవం లేదని చెప్తూ.. సెర్గీ నేను ఫ్రెండ్స్. నిన్న రాత్రి కలిసి పార్టీ కూడా చేసుకున్నాం. అతని భార్యను మూడేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే చూశాను. అది కూడా చాలామంది సమక్షంలోనే. రొమాంటిక్ గా మా మధ్య ఏం జరగలేదు” అని వివరణ ఇచ్చాడు.

బ్రిన్, భార్య షనహాన్ కలిసి ఉండటం లేదని దానికి ఎలన్ మస్క్‌తో ఎఫైర్ ఉండటమే కారణమంటూ ప్రచారం జరిగింది. దానిపై వివరణ ఇస్తూనే వస్తున్నాడు మస్క్. మస్క్ మోకాలిపై కూర్చొని బ్రిన్ భార్యను క్షమాపణ అడిగాడని అప్పుడే తన భార్యకు ఉన్న అఫైర్ గురించి తెలిసిందని, కాకపోతే వారిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోరని మీడియాలో కథనాలు వచ్చాయి.

Read Also: బుల్‌షిట్.. నాకు ఆమెతో అటువంటి సంబంధం లేదు – ఎలన్ మస్క్

తనపై కావాలనే వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచారం చేస్తున్నారని మస్క్ ఆరోపించారు. చాలాకాలంగా తాను సెక్స్ కూడాచేయలేదని ఇవన్నీ వట్టి రూమర్లేనని కొట్టిపారేశారు.