Zelensky: కేన్స్‌ వేడుకలో యుక్రెయిన్‌ అధ్యక్షుడి భావోద్వేగ ప్రసంగం

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కేన్స్ వేడుకల్లో భావోద్వేగ ప్రసంగం చేశారు. మా దేశంపై రష్యా జరుపుతోన్న దాడుల్లో నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా అంటూ ...

Zelensky: కేన్స్‌ వేడుకలో యుక్రెయిన్‌ అధ్యక్షుడి భావోద్వేగ ప్రసంగం

Zelensky

Zelensky: యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కేన్స్ వేడుకల్లో భావోద్వేగ ప్రసంగం చేశారు. మా దేశంపై రష్యా జరుపుతోన్న దాడుల్లో నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా అంటూ ప్రశ్నించారు. సినీ ప్రపంచం మొత్తం మాకు మద్దతుగా నిలవాలని, పుతిన్ దురాగతాలను గొంతెత్తి చాటాలంటూ వేడుకున్నారు. ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవం కేన్స్‌ వేడుక ఫ్రాన్స్‌లో మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ యుక్రెయిన్‌ నుంచి లైవ్‌ శాటిలైట్‌ వీడియో ద్వారా కేన్స్‌ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ప్రసంగం చేశారు.

Zelensky: జెలెన్‌స్కీ జాకెట్ ఖరీదు రూ.90లక్షలా

ఈ సందర్భంగా ఛార్లి చాప్లిన్ తీసిన ‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమాను జెలెన్‌స్కీ ప్రస్తావించాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయం సమయంలో చార్లి చాప్లిన్ తీసిన ది గ్రేట్ డిక్టేటర్ ప్రస్తుతం యుక్రెయిన్ పరిస్థితులకు భిన్నంగా ఏమీ లేదని అన్నారు. ఆ సినిమాలో చాప్లిన్ డిక్టేటర్.. నిజమైన నియంతను నాశనం చేయలేకపోవచ్చు.. కానీ అలాంటి దారుణాల పట్ల సినీ ప్రపంచం మౌనంగా ఉందని మాత్రం ఆ చిత్రం చాటిచెప్పిందన్నారు. ‘మనుషుల మధ్య ద్వేషం పోతుంది, నియంతలు మరణిస్తారు.. ప్రజల నుంచి వారు బలవంతంగా తీసుకున్న అధికారం.. తిరిగి ప్రజలకు వస్తుంది’ అంటూ ది గ్రేట్ డిక్టేటర్ సినిమాలోని డైలాగ్ ను జెలెన్‌స్కీ చెప్పడంతో.. వేడుకకు హాజరైన వారంతా లేచి చప్పట్లతో స్వాగతించారు. ఇకనైనా యుక్రెయిన్ లో రష్యా దురాక్రమాలపై సినీ ప్రపంచం గొంతెత్తి ఖండించాలని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశాడు.