Zelensky On Australia : మీ సాయం మరువం, పుస్తకాల్లో రాసుకుంటాం- జెలెన్ స్కీ

ఆస్ట్రేలియా సహా ఇతర దేశాల సాయాన్ని యుక్రెయిన్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మీ సహకారం మా చరిత్ర పుస్తకాల్లో రాసుకుంటాం.

Zelensky On Australia : మీ సాయం మరువం, పుస్తకాల్లో రాసుకుంటాం- జెలెన్ స్కీ

Russia Ukraine war

Zelensky On Australia Help : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు నెలలకు పైగా యుక్రెయిన్ పై రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలు కన్నెరజేసినా, కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించినా.. పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అనుకున్నది సాధించే వరకు యుద్ధాని ఆపేది లేదంటున్నారు. మరోవైపు యుక్రెయిన్ సేనలు సైతం వెనకడుగు వేయడం లేదు. ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కొంటున్నాయి. యుక్రెయిన్ సైన్యం పెద్ద సంఖ్యలోనే రష్యన్ సైనికులను మట్టుబెట్టింది.

కాగా, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను ఎదుర్కోవడానికి మరింత సాయం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు జెలెన్ స్కీ. ” మా దేశానికి ఆస్ట్రేలియా అందిస్తున్న సాయం చరిత్రలో నిలిచిపోతుంది. ఆస్ట్రేలియా సహా ఇతర దేశాల సాయాన్ని యుక్రెయిన్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మీ సహకారం మా చరిత్ర పుస్తకాల్లో రాసుకుంటాం” అని జెలెన్ స్కీ అన్నారు.

Australia's Contribution To War Effort Will Go Down In Ukraine's History Books, Zelensky

Australia’s Contribution To War Effort Will Go Down In Ukraine’s History Books, Zelensky

వారాలు లేదా రోజుల్లో విజయం సాధిస్తుందని భావించిన చాలా పెద్ద సైన్యాన్ని తిప్పికొట్టడానికి తన దేశం చేసిన రెండు నెలల పోరాటానికి ఆస్ట్రేలియాతో సహా అంతర్జాతీయ సమాజం నుండి వచ్చిన మద్దతును ఎన్నటికీ మరువం అన్నారు. నేను ఆస్ట్రేలియన్ ప్రజలకు చాలా కృతజ్ఞతతో ఉండాలని జెలెన్ స్కీ అన్నారు. మీరు ఇప్పటికే మాకు సాయం చేశారు, ఇది నిజం. కానీ మాకు ఇంకా ఎక్కువ కావాలి, ఇది కూడా నిజం అని జెలెన్ స్కీ అన్నారు.

Putin New Plan : యుక్రెయిన్‌పై వార్‌లో పుతిన్‌ కొత్త ప్లాన్

”నన్ను క్షమించండి. నేను యుద్ధ దేశానికి అధ్యక్షుడిని. యుద్ధంలో ఉన్న దేశం… మీరు నా ఆవేదనను అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. యుక్రెయిన్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. మీ (ఆస్ట్రేలియా) సాయం గురించి మా చరిత్ర పుస్తకాల్లో రాయబడుతుంది. చాలా ధన్యవాదాలు” అని యుక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.

Australia's Contribution To War Effort Will Go Down In Ukraine's History Books, Zelensky

Australia’s Contribution To War Effort Will Go Down In Ukraine’s History Books, Zelensky

ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు జెలెన్ స్కీ. రష్యా బలగాలు చేస్తున్న దురాక్రమణను అడ్డుకునేందుకు మరింత సాయం కావాలని అభ్యర్థించారు. ఈ యుద్ధ సమయంలో చూసిన భయానక దృశ్యాలు, యూరప్ కు పొంచి ఉన్న అణు ప్రమాదం గురించి మాట్లాడారు. వారం రోజుల్లో ముగించుకొద్దామని రష్యా దాడిని ప్రారంభించిందని, అయితే, ఇన్ని రోజులుగా దానిని ఎదిరించి నిలిచేందుకు యుక్రెయిన్ కు అందుతున్న సాయాన్ని జెలెన్ స్కీ ప్రస్తావించారు.

Ukraine Crisis: అదంతా కట్టుకథే.. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ పాత్రపై స్పష్టత ఇచ్చిన ఉక్రెయిన్ సైన్యం

రష్యా బలగాలు పాల్పడుతున్న యుద్ధ నేరాలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని జెలెన్‌స్కీ వాపోయారు. ”సామాన్య ప్రజలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే.. బాధ, కోపం కలిగింది. ప్రతీకారం తీర్చుకోవాలనిపించింది. అంత మానవత్వం లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారనిపించింది. మీరు మీ మానవత్వాన్ని కోల్పోయినా, నేను దానిని వదులుకోదల్చుకోలేదు. ఈ విధమైన బలహీనత గురించి చెప్పడానికి భయపడదల్చుకోలేదు. అందుకే నేను అన్నింటిని చూస్తున్నాను. యుద్ధాన్ని జీవితంలో భాగంగా చేసుకోవడం.. ఒక చెత్త అలవాటు. ఈ యుద్ధంలో నా ప్రజలు, సైనికులు పోరాడుతున్నారు. ఎన్నో బాధలు పడుతున్నారు. ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్న రష్యా.. చెర్నోబిల్ ప్రాంతంలో అణ్వాయుధాలను ఉపయోగించదని కచ్చితంగా చెప్పలేము” అని జెలెన్ స్కీ అన్నారు.