Putin New Plan : యుక్రెయిన్‌పై వార్‌లో పుతిన్‌ కొత్త ప్లాన్

జెర్సాన్‌ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన పోరాటం జరుగుతున్నా రష్యా ఈ ప్రయత్నాల్లో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు తమకు నమ్మకమైన సమాచారం అందిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

Putin New Plan : యుక్రెయిన్‌పై వార్‌లో పుతిన్‌ కొత్త ప్లాన్

Putin New Plan

Putin new plan : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుక్రెయిన్‌పై యుద్ధంలో మరో కీలక అడుగు వేసేందుకు పావులు కదుపుతున్నారు. తన ఉక్కుపిడికిలిలో బంధించిన ప్రాంతాలను రష్యాలో శాశ్వత భాగాలుగా మార్చేసేందుకు యత్నాలు చేస్తున్నట్లు పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. యుక్రెయిన్‌ తూర్పుభాగంపై తన పట్టును బిగించేందుకే ఈ ప్రయత్నాలని అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. జెర్సాన్‌ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన పోరాటం జరుగుతున్నా రష్యా ఈ ప్రయత్నాల్లో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు తమకు నమ్మకమైన సమాచారం అందిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 2014లో క్రిమియాను ఆక్రమించుకొన్న తర్వాత కూడా రష్యా ఇదే వ్యూహాన్ని అనుసరించింది.

ఈ నెలలో రష్యా లుహాన్స్క్‌, డొనెట్స్క్‌ లేదా ఖెర్సాన్‌ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుందని అమెరికా నిఘా సంస్థలు తెలిపాయి. యుక్రెయిన్‌ను వీడి రష్యాతో కలిసేందుకు అక్కడి ప్రజల మద్దతు ఉందని చెప్పేందుకు ఈ చర్యలు చేపట్టనుంది. దీంతో పాటు తనకు నమ్మకమైన వ్యక్తులను అక్కడి పాలకులుగా పుతిన్‌ నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ ఓటింగ్‌ అనేది ఓ ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం విలీనం చేసుకొన్నామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందని నిఘా సంస్థలు చెప్పాయి.

Russia-Ukraine War : రష్యా సైనికుల్ని అడ్డుకోవటానికి గ్రామాన్ని నీటితో ముంచేసిన యుక్రెయిన్ వాసులు

ఇలాంటి వ్యూహాలను రష్యా అనుసరించడం కొత్తేమి కాదని అమెరికా ఆర్గనైజేషన్‌ ఫర్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ప్రతినిధి వెల్లడించారు. ఇక రష్యా ఆక్రమణ విషయంలో అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల అంచనాలు తప్పలేదని ఆయన చెప్పారు. మరోవైపు రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో కనుక రెఫరెండం నిర్వహిస్తే చర్చలకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయినట్లేనని యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ మధ్య వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలో సమస్య మరింత చిక్కుముడులు పడే అవకాశం ఉంది.