నేను మందుబాబుని కాదండీ..కేక్ తింటే చాలు పొట్టలో మద్యంగా మారిపోతోంది..!!

నేను మందుబాబుని కాదండీ..కేక్ తింటే చాలు పొట్టలో మద్యంగా మారిపోతోంది..!!

England man Drunk Eating Cake : ‘‘నేను మద్యం తాగనండీ బాబూ..కానీ ఎప్పుడూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతుంటాను. ఇది నా ఖర్మ..నేను మద్యం తాగనని చెప్పినా ఎవ్వరూ నమ్మట్లేదు. దీంతో నేను నా హెల్త్ సర్టిఫికెట్ చూపించాల్సి వస్తోంది’’అంటూ వాపోతున్నాడు ఇంగ్లాండ్‌ లోని లోలోఫ్ట్‌లోని సఫోల్క్‌ చెందిన కార్సన్ అనే వ్యక్తి. కార్సన్ కు 62 ఏళ్లు.

ఇతనికి ఓ వింత వ్యాధి ఉంది. దాన్ని వ్యాధి అనేకంటే ఓ విచిత్రమైన మాట వాడాలేమో. కార్సన్ పొరపాటున కేకు తిని కారు ఎక్కడంటే చాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిపోతాడు. అలా పోలీసులకు దొరక్కుండా ఒక్కసారికూడా ఇంటికి వెళ్లింది లేదు. దారిలో పోలీసులు పట్టుకుంటే ‘‘నేను మద్యం తాగలేదు..మొర్రో నా మాట నమ్మండి..అని మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోరు. ఏంటీ నఖరాలు అంటూ హుంకరిస్తారు. దీంతో కార్సన్ డాక్టర్లు తనకు ఉన్న వింత వ్యాధి గురించి ఇచ్చిన హెల్త్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి వస్తోంది.

కేకు తింటే మద్యంలా మారిపోతుందనేది కార్సన్ కు ఉన్న ఓ అరుదైన సమస్య. దీన్నే ‘ఆటో బ్రూవరీ సిండ్రోమ్ (ABS)’ అని అంటారట వైద్యభాషలో. ఈ సమస్య ఉన్నవారు ఒక్క చుక్కైనా ఆల్కహాల్ తాగకుండానే శరీరంలో మద్యం తయారైపోతుంది. ఇది వినటానికి చిత్రంగానే అనిపించినా..నిజమే నంటున్నారు నిపుణులు.

పాపం కార్సన్ కున్న ఈ సమస్యల వల్ల మూడుసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద జరిమానా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నాడు. నేను చేయనిదానికి కూడా ఫైన్లు కట్టాల్సి వస్తోందని ఒకటే వాపోతుంటాడు.

ప్రస్తుతం 62 ఏళ్ల వయస్సున్న కార్సన్ 20 ఏళ్లు ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పని చేశాడు. 2003 సంవత్సరంలో పనిలో ఉన్నప్పుడు బలమైన ఫ్లోరింగ్ ద్రావకం వాసన పీల్చాడు. అప్పటి నుంచి అతడిలో మార్పులు రావడం మొదలైందట.

తనకు తెలియకుండానే తన శరీరంలో వచ్చిన ఈ సమస్యను కార్సన్ వెంటనే గుర్తించలేకపోయాడు. కొన్నేళ్లు గడిచిన తర్వాత ఆమె భార్యకు అనుమానం వచ్చింది. దీంతో టెస్టులు చేయించగా..ఈ విషయం బయటపడింది. అప్పటి నుంచి కార్సన్ తనతో పాటు బ్రీత్‌లైజర్ వెంట తీసుకెళ్లేవాడు.

ఎందుకంటే.. ఎప్పుడు ఎలా అతడి శరీరంలో మద్యం తయారైపోతుందనేది అతడికి అస్సలు తెలీదు. దీంతో డ్రైవింగ్ చేసేప్పుడు మధ్య మధ్యలో తన శ్వాసను తానే టెస్ట్ చేసుకుంటుంటాడు. ఈ సమస్య వల్ల పాపం కార్సన్ కు ఎంతో ఇష్టమైన కేక్ తినటం కూడా మానేశాడు.