World Record: క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ సరికొత్త రికార్డు.. వన్డేల్లో అత్యధిక స్కోరు..

వన్డే క్రికెట్ చర్రితలో ఇంగ్లాండ్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. నెదర్లాండ్స్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. గతంలో ఆస్ట్రేలియాపై ఆ జట్టు నమోదు చేసిన 481 స్కోరును బద్దలుకొట్టి తిరిగి సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 498 పరుగులు సాధించింది.

World Record: క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ సరికొత్త రికార్డు.. వన్డేల్లో అత్యధిక స్కోరు..

England

World Record: వన్డే క్రికెట్ చర్రితలో ఇంగ్లాండ్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. నెదర్లాండ్స్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. గతంలో ఆస్ట్రేలియాపై ఆ జట్టు నమోదు చేసిన 481 స్కోరును బద్దలుకొట్టి తిరిగి సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. శుక్రవారం నెదర్లాండ్స్ తో జరిగిన తొలి వన్డేలో 50 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 498 పరుగులు సాధించింది. వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరు ఇదేకావడం విశేషం.

తొలుత టాస్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. బ్యాట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ప్లేయర్లు నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వరుస బౌండరీలతో పరుగుల వరద పారించారు. ఓపెనర్ జేసన్ రాయ్ ఒకేఒక్క పరుగు చేసి ఔట్ అయినప్పటికీ మరో ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మలాన్ సెంచరీలు చేశారు. స్టాల్ 93బంతుల్లో 122 పరుగులు చేయగా, మలాన్ 109 బంతుల్లో 125 పరుగులు చేశారు. ఆ తరువాత వచ్చిన బట్లర్ కేవలం 70 బంతుల్లో 162 పరుగులు రాబట్టాడు. ఇందులో 14 సిక్సర్లు ఉన్నాయి. చివరిలో వచ్చిన లివింగ్ స్టోన్ 22 బాల్స్ కు 66 పరుగులు చేశారు. దీంతో 50 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ స్కోర్ 498కి చేరింది. వన్డే చరిత్రలో ఇదే అత్యుత్తమ రికార్డు.

England (1)

ఇదిలాఉంటే.. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 జట్ల వివరాలు చూస్తే.. ఇంగ్లాండ్ 498/4(నెదర్లాండ్), ఇంగ్లాండ్ 481/6(ఆస్ట్రేలియా), ఇంగ్లాండ్ 444/3(పాకిస్థాన్), శ్రీలంక 443/9(నెదర్లాండ్స్​), దక్షిణాఫ్రికా 439/2(వెస్టిండీ), దక్షిణాఫ్రికా 438/9(ఆస్ట్రేలియా), దక్షిణాఫ్రికా 438/4(భారత్), ఆస్ట్రేలియా 434/4(దక్షిణాఫ్రికా), దక్షిణాఫ్రికా 418/5(జింబాబ్వే), భారత్ 418/5(వెస్టిండీస్).