Europe Eunice storm : లండన్ లో రాకాసి గాలుల్లో కొట్టుకుపోతున్న జనాలు..ఊగిపోతున్న విమానాలు

యూరప్ లో యూనిస్ తుపాను ప్రభావానికి మనుషులు గాలుల్లో కొట్టుకుపోతున్నారు. విమానాలు సైతం ఊగిపోతున్నాయి రాకాసి గాలుల ధాటికి..

Europe Eunice storm : లండన్ లో రాకాసి గాలుల్లో కొట్టుకుపోతున్న జనాలు..ఊగిపోతున్న విమానాలు

Europe Eunice Storm

Eunice storm effects Europe : యూనిస్ తుపాను యూరప్ ను వణికిస్తోంది. వాయువ్య ఐరోపా లో యూనిస్ తుఫాను ప్రభావంతో గంటకు 196 కిలోమీట్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ రాకాసి గాలుల ధాటికి జనాలు రోడ్లపై నిలువలేకపోతున్నారు. రోడ్డుపై నడుస్తున్నవారు గాలి వేగానికి కొట్టుకుపోతున్నారు. గాలి ధాటికి నిలవలేక బొమ్మల్లా కొట్టుకుపోతున్నారు. నిభాయించుకుని నడుద్దామన్నా కుదరటంలేదు. దేన్ని పట్టుకున్నా గాలికి ఎగిరిపోయేంత వేగంగా గాలులు వీస్తున్నాయి.

మనుషులే అనుకుంటే ఏకంగా విమానాలు సైతం ఊగిపోతున్నాయి. ఇంటి పైకప్పులు పేక ముక్కల్లా ఎగిరిపోతున్నాయి. యూరప్ అంతా ఇప్పుడు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీరప్రాంతాల ప్రజలు మరింత సమస్యను ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల కరెంటు తీగలు తెగిపోవడంతో అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రింది వీడియోలో చూడండీ యూనిస్ తుఫాను బీభత్సమేంటో కనిపిస్తోంది. దక్షిణ లండన్ లో జనాలు ఎలా కొట్టుకుపోతున్నారో..బొమ్మల్లా ఎగిరిపోతున్నారు..

Also read : Storm Eunice : యూనిస్‌ తుఫాను బీభత్సం.. 9 మంది మృతి.. రాకాసి గాలుల భయానక దృశ్యాలు..

సెంట్రల్ అట్లాంటిక్‌లో యూనిస్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. వాయువ్య ఐరోపా (Northwestern Europe)లో యూనిస్ తుఫాను ప్రభావంతో గంటకు 122 మైళ్ల వేగం (196కిలోమీటర్లు)తో గాలులు వీస్తున్నాయి. ఇప్పటివరకూ రాకాసి గాలుల ధాటికి ఇప్పటివరకూ 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఐరోపాలో మిలియన్ల మందిపై తుఫాను ప్రభావం పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంగ్లండ్‌‌లో బలమైన గాలులు వీస్తున్నాయి. దక్షణ దేశంలో అన్ని ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో అల్లకల్లోలమైపోయాయి.

నార్తరన్ యూరోపియన్ దేశాల్లో బెల్జియం, ఐర్లాండ్, నెదర్లాండ్స్ లో తుఫాను తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకూ బ్రిటన్ దేశంలో తుఫాను ధాటికి ముగ్గురు మృతిచెందాగా.. దక్షిణ ఇంగ్లండ్‌లో మరొకరు దుర్మరణం పాలయ్యారు. తుఫాను కారణంగా పదివేల మంది నివాసితులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సెంట్రల్ అట్లాంటిక్‌లో ఏర్పడిన యూనిస్ తుఫాను జెట్ స్ట్రీమ్ ద్వారా అజోర్స్ నుంచి యూరప్ వైపు దూసుకెళ్తోంది. ఈ తుఫాను ఆ ప్రాంతవాసుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని బ్రిటన్ వాతావరణ కార్యాలయం వెల్లడించింది.

Also read : Stormy Cheers: నార్త్‌ కొరియా కిమ్ శాడిజం.. మైనస్‌ 15 డిగ్రీల ఉష్టోగ్రతలో!

తుఫాను పశ్చిమ ఇంగ్లాండ్‌ను తాకింది. ఆపై కార్న్‌వాల్‌లో తీరాన్ని తాకింది. అక్కడ అలలు తీరాన్ని తాకాయి. లండన్‌లో రాకాసి గాలల బీభత్సానికి ఒక మహిళ ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. లివర్‌పూల్‌లో గాలుల ప్రభావానికి శిథిలాలు గాల్లో ఎగిరిపోతున్నాయి.