cancer : వైద్య చరిత్రలోనే మరో అద్భుతం..‘టాబ్లెట్ తో క్యాన్సర్’ ఖతం

వైద్య చరిత్రలోనే మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటి డ్రగ్‌ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని మంచి ఫలితాలను సాధించింది. పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిపై దీన్ని ప్రయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఆర్నెళ్ల పాటు చేసిన క్లినికల్ ట్రయల్స్‌ సక్సెస్‌ కావడంతో.. ఒక్క మందు బిళ్లతో ఓ రకం క్యాన్సర్‌ పూర్తిగా అంతం కానుంది.

cancer : వైద్య చరిత్రలోనే మరో అద్భుతం..‘టాబ్లెట్ తో క్యాన్సర్’ ఖతం

Cancer

ancer Vanishes For Every Patient In Drug Trial : వైద్య చరిత్రలోనే మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటి డ్రగ్‌ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని మంచి ఫలితాలను సాధించింది. పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిపై దీన్ని ప్రయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఆర్నెళ్ల పాటు చేసిన క్లినికల్ ట్రయల్స్‌ సక్సెస్‌ కావడంతో.. ఒక్క మందు బిళ్లతో ఓ రకం క్యాన్సర్‌ పూర్తిగా అంతం కానుంది.

క్యాన్సర్… ఈ వ్యాధి పేరు వింటే చాలు, కాళ్లు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు.. చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన తప్పదు. క్యాన్సర్‌ సోకిందంటే.. జీవితాన్ని కొద్ది రోజులుగా పొడిగించుకోవాలే తప్ప.. ఎన్నాళ్లు బతుకుతామో గ్యారంటీ ఇవ్వలేని రోగం ఇది. తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. ఒకవేళ కోలుకున్నా.. జీవితాంతం వెంటాడే క్యాన్సర్‌ సమస్యలు.. బతకనీయకుండా చేస్తాయి. క్యాన్సర్ ప్రాణాలను సైతం బలితీసుకుంటుంది. బ్రెస్ట్, లంగ్స్, స్కిన్, త్రోట్.. ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు సోకే ఈ వ్యాధి.. మానవాళిపై దండయాత్ర చేస్తోంది. తనకు అంతమనేది లేదని రెచ్చిపోతోంది. కానీ, అమెరికా సైంటిస్టులు చేసిన క్లినికల్ ట్రయల్స్.. క్యాన్సర్‌ను పూర్తి స్థాయిలో తగ్గించవచ్చన్న భరోసా కల్పిస్తున్నాయి. ఒక్క మందు బిళ్లతో పెద్ద పేగు క్యాన్సర్‌ మటుమాయమవడం.. వైద్య శాస్త్రాన్నే నివ్వెరపరుస్తోంది. క్యాన్సర్‌ రోగులకు బతకాలన్న ఆశ.. జీవించాలన్న కోరికను రెట్టింపు చేస్తోంది.

న్యూయార్క్‌లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు నిర్వహించిన ఓ డ్రగ్ ట్రయల్స్.. క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. పెద్ద పేగు కాన్సర్‌తో బాధపడుతున్న 18 మందిపై చేసిన క్లినికల్ ట్రయల్స్ గ్రాండ్ సక్సెస్‌ అయ్యాయి. ఆర్నెళ్లలోనే క్యాన్సర్‌ను ఖతం చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు సైంటిస్టులు.

క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ, రేడియేషన్, ఆపరేషన్లతో క్యాన్సర్‌ రోగులు తీవ్ర శారీరక వేదనను అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో కొంత మందిని సెలెక్ట్ చేసుకున్నారు న్యూయార్క్‌లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ సైంటిస్టులు. పెద్ద పేగు కాన్సర్‌తో బాధపడుతున్న 18 మందిపై డోస్టార్లిమాబ్ అనే ఔషధాన్ని ప్రయోగించారు. ఈ డ్రగ్ ప్రయోగాలతో క్యాన్సర్‌కు చెక్ పెట్టడంతో పాటు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోగులందరికీ.. ఆర్నెల్ల పాటు ఈ ఔషధాన్ని ఇవ్వగా.. ట్రయల్స్ ముగిసేసరికి వారిందరిలో క్యాన్సర్ కణజాలం కనిపించకుండా మాయమైందని ప్రకటించారు సైంటిస్టులు. క్యాన్సర్‌కు ఎలాంటి చికిత్సలు అవసరం లేని రీతిలో వారంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ప్రకటించారు.

డోస్టార్‌లిమాబ్ డ్రగ్‌లో ల్యాబ్‌లో రూపొందించిన అణువులు ఉంటాయి. ఇవి మానవ శరీరంలోకి ప్రవేశించిన అనంతరం యాంటీబాడీలుగా వృద్ధి చెందుతూ.. క్యాన్సర్ కణాలను అంతరించిపోయేలా చేసినట్లు చెప్పారు న్యూయార్క్‌ సైంటిస్టులు. ఈ డ్రగ్ వాడిన తర్వాత ఆ 18 మంది రోగులకు ఎండోస్కోపీ, పీఈటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించినా.. అన్ని టెస్టుల్లో క్యాన్సర్ కణాలు కనిపించలేదని ప్రకటించారు. ఇది క్యాన్సర్ చరిత్రలో అద్భుత పరిణామం అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఓ డ్రగ్‌తో క్యాన్సర్ మటుమాయం కావడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు.

సాధారణంగా క్యాన్సర్‌ సోకితే.. రోగులు గుర్తించే లోపే ఎన్నో స్టేజీలు దాటిపోతుంది. కానీ, క్యాన్సర్‌ ఏ స్టేజ్‌లో ఉన్నా.. డోస్టార్‌లిమాబ్‌ను ఇచ్చిన తర్వాత రోగుల్లో క్యాన్సర్ ఒకే దశలో ఉందని గుర్తించారు సైంటిస్టులు. పెద్ద పేగులో ఏర్పడ్డ క్యాన్సర్‌ కణాలు.. ఎక్కడివక్కడే ఉన్నాయని.. ఇతర అవయవాలకు వ్యాపించలేదని ప్రకటించారు. దీంతో క్యాన్సర్‌ చికిత్సల్లో ఈ చికిత్స ఆశాజనకంగా కనిపిస్తోంది. అయితే ఇది ఎక్కువ మంది రోగులకు పని చేస్తుందో లేదో..? అనే విషయంతో పాటు క్యాన్సర్‌ నుంచి ఉపశమనం కోసం పెద్దఎత్తున ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
యార్క్‌ సైంటిస్టులు చేసిన ట్రయల్స్‌ ఫలితాలు ఇప్పుడు వైద్య ప్రపంచంలో సంచలనం రేపుతున్నాయి. క్యాన్సర్‌ సోకిన తర్వాత.. రోగిలో పూర్తి ఉపశమనం అనేది ఇప్పటి వరకు వినలేదని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రపంచంలో ఇది మొదటి పరిశోధన కాగా.. ముందు ముందు మరిన్ని క్యాన్సర్లకు మందు కనిపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలను కాదని.. నొప్పి లేకుండా క్యాన్సర్‌కు అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్‌ వస్తే.. ప్రపంచం ముందు క్యాన్సర్‌ ఆటలు ఖతం అయ్యే ఛాన్సెస్‌ ఉన్నాయి.