భయపెట్టే పిల్లతో ఫ్యామిలీ…కస్టమర్లను అవమానించిన కేఫ్

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2019 / 10:31 AM IST
భయపెట్టే పిల్లతో ఫ్యామిలీ…కస్టమర్లను అవమానించిన కేఫ్

న్యూజిలాండ్‌ కి చెందిన ఓ మహిళ ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక కేఫ్ వర్కర్ తన రెండేళ్ల కుమార్తెను బిల్లుపై ‘భయపెట్టే పిల్లవాడిగా’ అభివర్ణించడంతో ఒక మహిళ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసింది. 

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని కాఫీ సుప్రీంకు గత శనివారం కింబర్లీ స్జే అనే మహిళ తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. కుబంంతో కలిసి ఎగ్స్,బన్ ఐటమ్స్ ని తినింది. అయితే ఆమెకు ఇచ్చిన బిల్లు చూసి ఆమె షాక్ అయింది. ఆ బిల్లుపై ఫ్యామిలీ విత్ ది టెర్రిఫైయింగ్ కిడ్(భయపెట్టే పిల్లతో ఫ్యామిలీ)అని ఓ లైన్ బిల్లుపై రాసి ఉంది. బిల్లులో టేబుల్ నంబర్‌ను ప్రస్తావించే బదులు, కేఫ్ వర్కర్ ఆ లైన్ టైప్ చేశాడు. ఈ బిల్లును కింబర్లీ తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసింది. హే కాఫీ సుప్రీం… మీరు కాఫీ సుప్రీం వెల్లెస్ స్ట్రీట్‌లో మీ సిబ్బందికి కొంచెం మెరుగ్గా శిక్షణ ఇవ్వాలనుకోవచ్చు. భయంకరమైన పిల్లతో కుటుంబాన్ని అంటూ మా బిల్లుపై రాయడం,ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అధికంగా వసూలు చేయడం … చాలా బాగుంది అంటూ ఆమె ఆ బిల్లు ఫొటోనే పోస్ట్ చేసింది. 

ప్రతి వారాంతంలో తాను ఆ కేఫ్ కు వెళ్లేదానని,తన కుమార్తె ప్రవర్తనకు విషయానికొస్తే… తను మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా ఉంటుందని కూడా కింబర్లీ చెప్పారు. తను ఎప్పుడూ భయపెట్టేదిగా లేదని, ఎలాంటి సమస్యలను కలిగించలేదని కింబర్లీ తన పోస్ట్‌లో తెలిపారు. తమ పట్ల చాలా అగౌరవంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కాఫీ సుప్రీం యాజమాన్యం కింబర్లీకి క్షమాపణలు చెప్పింది.