Gun Fire : అనుమానంతో కూతురిపై కాల్పులు

ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది.

Gun Fire : అనుమానంతో కూతురిపై కాల్పులు

Gun Fire

Gun Fire : ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. జానే హెయిర్‌స్టన్(16) అనే బాలిక ఓహియోలోని కొలంబస్‌‌లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతాల్లో వారి ఇంటి గ్యారేజ్ నుంచి శబ్దాలు వినిపించడంతో.. దొంగలు వచ్చారని అనుమానించిన హెయిర్‌స్టన్ తండ్రి కాల్పులు జరిపాడు.

చదవండి : Firing In Wedding Ceremony : పెళ్లి జరుగుతుండగా జై శ్రీరామ్ అంటూ కాల్పులు..ఒకరు మృతి

కాసేపటి తర్వాత అటుగా వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న కూతురు కనిపించింది. దీంతో ఆమె తల్లి అమెరికా ఎమర్జెన్సీ నంబర్ 911 కాల్ చేసి జరిగిన విషయం తెలిపింది. ఘటనాస్థలిలోకి చేరుకున్న పోలీసులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5.42 నిమిషాలకు హెయిర్‌స్టన్ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి : Nagaland Firing : నాగాలాండ్ లో ఆర్మీ కాల్పులు..13 మందికి చేరిన మృతుల సంఖ్య