Nagaland Firing : నాగాలాండ్ లో ఆర్మీ కాల్పులు..13 మందికి చేరిన మృతుల సంఖ్య

ఉగ్రవాదులు అనుకుని..భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరపడంతో 13 మంది గ్రామస్తులు చనిపోవడంపై సీఎం నీఫియు రియో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Nagaland Firing : నాగాలాండ్ లో ఆర్మీ కాల్పులు..13 మందికి చేరిన మృతుల సంఖ్య

Nagaland

Nagaland Firing : ఉగ్రవాదులు అనుకుని..భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరపడంతో 13 మంది గ్రామస్తులు చనిపోవడంపై సీఎం నీఫియు రియో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మిలటరీ చేపట్టిన ఈ చర్యలు దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారరు. మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో సామాన్య ప్రజలను చంపడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

Read More : Sirpurkar Commission : దిశ ఎన్‌కౌంటర్ స్ధలాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమీషన్

దీనిని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి SIT విచారణ చేపట్టి..మరణించిన కుటుంబాలకు న్యాయం చేస్తుందన్నారు. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. నాగాలాండ్ లో జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి SIT క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం జరుగుతుందని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Read More : Yadadri Temple : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. వాహనాలు కిందనే నిలిపేస్తున్న అధికారులు

దీనిపై సైన్యం స్పందించింది. తిరుగుబాటు దారుల కదలికలున్నాయని విశ్వసనీయ సమాచారం అందడంతో..అక్కడకు బలగాలు వెళ్లడం జరిగిందని పేర్కొంది. తిరు, మోన్ జిల్లా, నాగాలాండ్ ప్రాంతంలో ఓ ఆపరేషన్ నిర్వహించాలని ప్రణాళిక నిర్వహించామని తెలిపింది. తిరు – ఓటింగ్ రోడ్డుపై గ్రామస్తులు తీసుకెళుతున్న వాహనంపై కాల్పులు జరిపాని, ప్రతిగా బలగాలు కాల్పులు జరపడంతో ఆరుగురు గ్రామస్తులు చనిపోయారని, ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యంలో మృతి చెందారని తెలిపింది. వెంటనే ఆగ్రహించిన స్థానికులు బలగాలను చుట్టుముట్టారని, ఆత్మరక్షణ కోసం ఆ గుంపుపై కాల్పులు జరపడంతో ఐదుగురు గ్రామస్తులు చనిపోయారని, మరో ఆరుగురికి గాయాలయ్యాయని..భద్రతా బలగాలకు చెందిన మూడు వాహనాలకు నిప్పు పెట్టారని పేర్కొంది. ఘటన జరగడం, తర్వాత జరిగిన పరిణామాలు తీవ్రంగా విచారిస్తున్నాయని వెల్లడించింది.